Nayanthara: షారూఖ్ సినిమాలో నయన్ పాత్ర ఇదేనట..

Nayanthara: షారూఖ్ ఖాన్ కుమారుడిపై డ్రగ్స్ కేసు విషయం కొన్నిరోజుల క్రితం వరకు బాలీవుడ్‌ను కుదిపేసింది. ఆర్యన్ ఖాన్‌కు బెయిల్ రాకపోవడం, జైలులోని కొంతకాలం ఉండాల్సి రావడం.. ఇవన్నీ షారూఖ్ ఖాన్‌ను చాలా డిస్టర్బ్ చేశాయి. షారూఖ్ కొన్నిరోజుల వరకు ఆర్యన్ కేసు పనుల్లోనే బిజీగా ఉండగా.. తన అప్‌కమింగ్ సినిమాలకు బ్రేక్ పడింది. తాజాగా అట్లీ దర్శకత్వంలో తాను నటిస్తున్న కొత్త సినిమాపై కూడా అనేక రూమర్లు వినిపించాయి.
నయనతార ప్రస్తుతం సౌల్‌లో లేడీ సూపర్‌స్టార్‌గా చలామణి అవుతున్నా తాను ఇప్పటివరకు బాలీవుడ్ వైపు చూడలేదు. తొలిసారి తన ఫేవరెట్ డైరెక్టర్‌తో కలిసి బాలీవుడ్ ఎంట్రీకి సిద్ధమయ్యింది. షారూఖ్ ఖాన్, అట్లీ మూవీలో హీరోయిన్‌గా నయన్ సెలక్ట్ అయ్యింది. ఇన్నా్ళ్లకు తాను బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నందుకు నయన్ అభిమానులు కూడా హ్యాపీగా ఫీల్ అయ్యారు. కానీ అన్ని అనుకున్నట్టు జరగవు కదా అన్నట్టు ఈ సినిమాలో నయన్ నటించట్లేదని వార్తలు వినిపించాయి.
ఆర్యన్ ఖాన్ కోసం తన సినిమాలను కొంతకాలం పక్కన పెట్టాడు షారూఖ్. దీంతో తన అప్‌కమింగ్ సినిమాల దర్శక నిర్మాతలు అయోమయంలో పడిపోయారు. కాల్ షీట్లు కూడా కేటాయించిన తర్వాత షారూఖ్ షూటింగ్లకు రాలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో తమ సినిమాలు మళ్లీ పట్టాలెక్కుతాయో లేదో అని ఖంగారుపడ్డారు. కానీ ఆర్యన్ క్షేమంగా ఇంటికి తిరిగొచ్చేయడంతో షారూఖ్ మళ్లీ సినిమాలపై దృష్టిపెట్టాడు.
షారూఖ్ ఇచ్చిన డేట్ల ప్రకారం సినిమాల షూటింగ్ జరగలేదు. అలాగే షారూఖ్ సినిమా కోసం నయన్ ఇచ్చిన డేట్లు కూడా వృధా అయిపోయాయి. దీంతో నయనతార ఈ సినిమా నుండి తప్పుకుంది అన్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ వార్తల్లో నిజం లేవంటూ నయన్ టీమ్ స్పష్టం చేసింది. ఈ సినిమాలో నయన్ ఒక ఇన్వెస్టిగేటివ్ పోలీసు ఆఫీసర్‌గా కనిపించనుందని వారు చెప్పారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com