అప్పుడు యాంకర్ గా.. ఇప్పుడు టాప్ హీరోయిన్ గా..

అప్పుడు యాంకర్ గా.. ఇప్పుడు టాప్ హీరోయిన్ గా..
షారుఖ్ ఖాన్‌తో కలిసి 'జవాన్'లో చివరిగా కనిపించిన నయనతార సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలోని బిగ్గెస్ట్ సూపర్ స్టార్‌లలో ఒకరిగా పరిగణించబడుతుంది.

షారుఖ్ ఖాన్‌తో కలిసి 'జవాన్'లో చివరిగా కనిపించిన నయనతార సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలోని బిగ్గెస్ట్ సూపర్ స్టార్‌లలో ఒకరిగా పరిగణించబడుతుంది. అయితే, నటి తన కెరీర్‌ను టీవీ హోస్ట్‌గా ప్రారంభించిందనే విషయం చాలా మందికి తెలియదు. సోషల్ మీడియాలో నయనతార యాంకర్ గా పని చేస్తోన్న వీడియో ఒకటి చక్కర్లు కొడుతోంది. ఆమె లుక్స్‌ చూసి చాలా మంది నెటిజన్లు షాక్ అయ్యారు. వీడియోలో ఉన్నది ఆమేనా అని ఆశ్చర్యపోతున్నారు.

వీడియోకు ప్రతిస్పందిస్తూ, ఒక నెటిజన్ 'డబ్బు ప్రతిదీ మారుస్తుంది' అని వ్యాఖ్యానించగా, మరొకరు 'ఆమె చాలా భిన్నంగా కనిపిస్తుంది' అని రాశారు. 'జవాన్'లో దీపికా పదుకొణెను హైలెట్ చేసి తనను సైడ్ చేసినందుకు దర్శకుడు అట్లీ పట్ల నయన్ కొంచెం కోపంగా ఉన్నట్లు వార్తలు వచ్చాయి. అతిధి పాత్రలో నటించిన దీపికాతో పోలిస్తే ఈ చిత్రంలో ఆమె పాత్ర పట్ల సంతోషంగా లేదని తెలుస్తోంది.

సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో పెద్ద సూపర్‌స్టార్ అయిన నయనతారకు 'జవాన్' నచ్చలేదని, ఇది SRK-దీపిక చిత్రంలా కనిపించిందని నివేదికలు పేర్కొన్నాయి. ఆమె మరో బాలీవుడ్ ప్రాజెక్ట్‌లో కనిపిస్తుందో లేదో అనే రూమర్స్ కూడా వినిపిస్తున్నాయి. జవాన్ చిత్రం విడుదలైన 18 రోజుల్లోనే దేశవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద ఇప్పటివరకు 560 కోట్ల రూపాయలకు పైగా వసూలు చేసింది. ఇక నయనతార తన తదుపరి చిత్రం 'కన్నప్ప'లో కనిపించనుంది. ఇందులో ప్రభాస్ హీరో కాగ, నయన్ అతిధి పాత్రలో నటించనుంది.

Tags

Read MoreRead Less
Next Story