Nayanthara: విఘ్నేష్‌కు నయన్ వాలెంటైన్స్ డే సర్‌ప్రైజ్.. వీడియో వైరల్..

Nayanthara: సెలబ్రిటీలు అందరు ఎవరి స్టైల్‌లో వారు వాలెంటైన్స్ డేను సెలబ్రేట్ చేసుకోవడంలో బిజీగా ఉన్నారు. చాలామంది తాము ప్రేమించిన వారికి స్పెషల్‌గా విషెస్ చెప్తున్నారు. ఈ వాలెంటైన్స్ విషెస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక కోలీవుడ్ క్యూట్ కపుల్ నయనతార, విఘ్నేష్ శివన్ కూడా వాలెంటైన్స్ డేను బాగా సెలబ్రేట్ చేసుకున్నారు.
సినీ పరిశ్రమలో ఓ హీరోయిన్, ఓ డైరెక్టర్ మధ్య లవ్ స్టోరీ కామన్. అలా ఇటీవల కాలంలో ప్రేమలో పడిన కోలీవుడ్ జంట హీరోయిన్ నయనతార, డైరెక్టర్ విఘ్నేష్ శివన్. విఘ్నేష్ శివన్ దర్శకత్వం వహించిన 'నేను రౌడీనే' అనే సినిమాలో నయన్ హీరోయిన్‌గా నటించింది. అప్పటినుండి వీరి లవ్ స్టోరీ స్టార్ట్ అయ్యింది. వీరు పెళ్లి గురించి క్లారిటీ ఇవ్వకపోయినా.. ప్రేమ పక్షులని మాత్రం ప్రేక్షకులకు ఎప్పుడో క్లారిటీ వచ్చేసింది.
తాజాగా నయనతార, సమంత హీరోయిన్లుగా విజయ్ సేతుపతి హీరోగా విఘ్నేష్ శివన్ తెరకెక్కిస్తున్న చిత్రం 'కాతువాకుల రెండు కాదల్'. ఈ సినిమా 'కణ్మణి రాంబో ఖతీజా' పేరుతో తెలుగులో కూడా విడుదల కానుంది. ఒకేసారి ఇద్దరు అమ్మాయిలను గాఢంగా ప్రేమించే అబ్బాయి కథే ఇది. ఇటీవల విడుదలయిన ఈ సినిమా టీజర్ కూడా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది.
ఒకవైపు వారు కలిసి చేస్తున్న సినిమా టీజర్ సక్సెస్, మరోవైపు వాలెంటైన్స్ డే.. ఈ రెండు ఈవెంట్స్‌ను ఒకేసారి సెలబ్రేట్ చేసుకున్నారు నయన్, విఘ్నేష్. విఘ్నేష్‌కు నయన్ మిడ్‌నైట్ విషెస్ తెలిపింది. అది కూడా ఓ పూల బొకే ఇచ్చి. అయితే ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన విఘ్నేష్.. 'తను మొదటిసారిలాగానే వచ్చి నీకు పువ్వులు ఇచ్చినప్పుడు కచ్చితంగా అది హ్యాపీ వాలెంటైన్స్ డేనే' అని క్యాప్షన్ పెట్టాడు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com