Nayanthara : సల్మాన్ ఖాన్ తో నయనతార

ఈ ఏజ్ లో కూడా వరుస మూవీస్ తో దూకుడు చూపిస్తోంది నయనతార. అలాగని ఏది పడితే అది చేయదు. కంటెంట్ బలంగా ఉండాలి.. దానికి తోడు విజయం గ్యారెంటీ అనిపించాలి.. అప్పుడే ఓకే చేస్తోంది. అందుకే తన చేతిలో ఇప్పుడు తమిళ్, మళయాల మూవీస్ చాలానే ఉన్నాయి. ఇక ఫస్ట్ టైమ్ బాలీవుడ్ లో అడుగుపెట్టి జవాన్ మూవీతో సత్తా చాటింది. అయితే ఈ దర్శకుడు సౌత్ వాడు.. అట్లీ. పైగా అట్లీ అంటే ఆమెకు ప్రత్యేక అభిమానం కూడా ఉంది. ఆ కారణంగానే బాలీవుడ్ లో డెబ్యూ మూవీగా జవాన్ చేసింది. ఇప్పుడు మరో బాలీవుడ్ మూవీతో రాబోతోంది.
షారుఖ్ ఖాన్ తర్వాత సల్మాన్ ఖాన్ ఆ లిస్ట్ లో ఉండబోతున్నాడు. విశేషం ఏంటంటే.. ఈ సారి కూడా సౌత్ డైరెక్టర్ కే ఓకే చెప్పింది నయనతార. అది తెలుగువాడైన వంశీ పైడిపల్లితో. యస్.. వంశీ పైడిపల్లి చెప్పిన కథకు స్పెల్ బౌండ్ అయిన సల్మాన్ ఖాన్ వెంటనే ఓకే చేశాడు. అలాగే వంశీ చెప్పిన కథకు నయనతార కూడా ఓకే చెప్పింది. ఆ కారణంగా ఈ రేర్ కాంబోలో మూవీ సిద్ధం అవుతోంది. మైత్రీ మూవీ మేకర్స్ వాళ్లు ప్రొడ్యూస్ చేయబోతోన్న మూవీ ఇది. మొత్తంగా నయనతార సెలెక్ట్ చేసిందంటే ఆ మూవీ గ్యారెంటీ హిట్ అనిపించేసుకున్నట్టే.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
