Nayanthara: భర్తకు ప్రేమతో.. రూ. 20 కోట్ల విలువైన బహుమతి...

X
By - Prasanna |11 Jun 2022 2:46 PM IST
Nayanthara: దాదాపు 6 సంవత్సరాల పాటు డేటింగ్ చేసిన నయనతార, విఘ్నేష్ శివన్ వివాహం చెన్నైలో ఘనంగా జరిగింది.
Nayanthara: దాదాపు 6 సంవత్సరాల పాటు డేటింగ్ చేసిన నయనతార, విఘ్నేష్ శివన్ వివాహం చెన్నైలో ఘనంగా జరిగింది.
ప్రియమైన శ్రీవారికి ప్రేమతో పెళ్లి కానుకలు చాలానే ఇచ్చింది నయన్. తన జీవిత భాగస్వామికి నయనతార ఇచ్చిన పెళ్లి కానుక అతిధులను ఆశ్చర్యపరిచింది.
విఘ్నేష్ శివన్ పేరు మీద రిజిస్టర్ అయిన 20 కోట్ల రూపాయల విలువైన భారీ భవనాన్ని ఇచ్చింది. నివేదికల ప్రకారం ఆస్తికి సంబంధించిన లావాదేవీలు పూర్తయినట్లు తెలుస్తోంది.
విఘ్నేష్ కూడా తమ పెళ్లి రోజు గుర్తుండిపోయేలా నయనతారకు రూ. 2.5 నుండి 3 కోట్ల రూపాయల విలువ చేసే బంగారు వస్తువులు తీసుకున్నాడు. అంతేకాకుండా పెళ్లికూతురు నయన తారకు రూ.5కోట్ల విలువైన డైమండ్ రింగ్ ను విఘ్నేష్ బహూకరించాడు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com