Nazriya Nazim: అంటే సుందరం కోసం ఆమె రెమ్యునరేషన్ బాగానే..

Nazriya Nazim: రాజారాణి మూవీతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన నజ్రియా నజిమ్ ఆ సినిమాలోని క్యూట్ ఎక్స్ ప్రెషన్స్ తో ఆడియన్స్ ని ఆకట్టుకుంది.. ఇక ఇప్పుడు అంటే సుందరానికి అంటూ నానీతో కలిసి నటించింది.. భారీ అంచనాలతో విడుదలైన ఈ చిత్రం పాజిటివ్ టాక్ తెచ్చుకుంది.
ఈ చిత్రంలో నానీ, నజ్రియాల నటన ఎక్కడా బోరుకొట్టకుండా ఉంది.. అయితే ఈ చిత్రం కోసం నజ్రియా రెమ్యునరేషన్ బాగానే తీసుకుందట. దాదాపు రూ.2 కోట్ల వరకు తీసుకుందని సమాచారం. ఇదే నిజమైతే దాదాపు టాలీవుడ్ స్టార్ హీరోయిన్ లకు ఏ మాత్రం తీసిపోని విధంగా ఈమె రెమ్యునరేషన్ తీసుకుందని పరిశ్రమ వర్గాలు అంటున్నాయి.
మలయాళం, తమిళ చిత్రాలలో నటించిన నజ్రియా నటిగా కెరీర్‌ను కొనసాగించే ముందు టీవీ షో యాంకర్‌గా పని చేసింది. ఆమె పలున్కు (2006)తో చైల్డ్ ఆర్టిస్ట్‌గా, మలయాళ చిత్రం మాడ్ డాడ్ (2013)లో ప్రధాన నటిగా రంగప్రవేశం చేసింది. ఆమె రాజా రాణి (2013), ఓం శాంతి ఓషానా (2014), వాయై మూడి పేసవుం (2014), బెంగుళూరు డేస్ వంటి చిత్రాలలో నటించి నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆమె ఆగష్టు 21, 2014 న నటుడు ఫహద్ ఫాజిల్‌ను వివాహం చేసుకుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com