NBK 109 : ‘వీరమాస్’ టైటిల్ ను ఫ్యాన్స్ వ్యతిరేకిస్తున్నారా?

NBK 109 : ‘వీరమాస్’ టైటిల్ ను ఫ్యాన్స్ వ్యతిరేకిస్తున్నారా?
X

నటసింహం నందమూరి బాలకృష్ణ ( Nandamuri Balakrishna ) యాక్షన్ చిత్రాల దర్శకుడు బాబీ (Bobby) తొలి కాంబినేషన్ లో ఒక సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవితో “వాల్తేర్ వీరయ్య” తెరకెక్కించి బ్లాక్‌బస్టర్‌ అందుకున్న నేపథ్యంలో బాలయ్య, బాబీ మూవీ పట్టాలెక్కింది. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ జరుపుకుంటోంది.

అసలు మేటర్లోకి వస్తే .. ఈ చిత్రానికి ‘వీర మాస్‌’ ( Veera Mass ) అనే టైటిల్‌ని పెట్టనున్నట్లు వార్తలు వచ్చాయి. బాలకృష్ణ గాడ్ ఆఫ్ మాసెస్ (God of Masses) కాబట్టి ఈ టైటిల్ తన ఇమేజ్ కు బాగా సరిపోతుందని దర్శకుడు నమ్ముతున్నాడు. అయితే ఇలాంటి టైటిల్స్‌ను అభిమానులు వ్యతిరేకిస్తున్నారు. పాత తరహా టైటిల్‌కు వ్యతిరేకంగా అభిమానులు బహిరంగంగానే మాట్లాడుతున్నారు.

ఈ చిత్రానికి నిర్మాత నాగ వంశీ అలాంటి పేరు నమోదు చేయడాన్ని ఆపాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పుడు NBK109 గా పిలవబడే ఈ చిత్రం 50 శాతం షూటింగ్ పూర్తి చేసుకుంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై నాగ వంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Tags

Next Story