#NBK 109 : సంక్రాంతి బరిలో బాలయ్య

టాలీవుడ్ అంటే సంక్రాంతికి.. ముఖ్యంగా స్టార్ హీరోలకు ఎంత ఇష్టమో వేరే చెప్పక్కర్లేదు. ఆ టైమ్ లో వచ్చే సినిమాలకు మినిమం గ్యారెంటీ ఉంటుంది. యావరేజ్ మూవీస్ కూడా హిట్ అయిపోతుంటాయి. అదే బలమైన కంటెంట్ తో వస్తే బ్లాక్ బస్టర్స్ తో పాటు రికార్డులూ గ్యారెంటీ. అందుకే సంక్రాంతికి చాల రోజుల ముందుగానే కర్చీఫ్ లు వేస్తుంటారు మేకర్స్. ఇప్పటికే సంక్రాంతి బరిలో మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర ఉంది. దీంతో పాటు వెంకటేష్, అనిల్ రావిపూడి మూవీ రవితేజ సినిమాలు జనవరి సెకండ్ వీక్ లో రాబోతున్నాయి. అయితే ఈ పోటీలో ఇప్పుడు బాలయ్య కూడా బరిలోకి దిగుతున్నాడట.
బాలయ్య 109వసినిమాగా రూపొందుతోన్న మూవీని మొదట డిసెంబర్ బరిలో విడుదల చేయాలనుకుున్నారు. కానీ ఏమైందో సంక్రాంతికే ఫిక్స్ అవుతున్నారని టాక్. వాల్తేర్ వీరయ్య తర్వాత బాబీ డైరెక్ట్ చేస్తోన్న మూవీ ఇది. కంప్లీట్ గా బాలయ్య మార్క్ మాస్ ఎంటర్టైనర్ గా రూపొందుతోంది. ఇప్పటి వరకూ వచ్చిన వీడియో కంటెంట్ చూస్తే మాగ్జిమం గ్యారెంటీ అనిపిస్తోంది. ఇక బాలయ్యతో పాటు ప్రగ్యా జైశ్వాల్, చాందిన చౌదరి, ఊర్వశి రౌతేలా ఫీమేల్ రోల్స్ చేస్తున్నారు. యానిమల్ ఫేమ్ బాబీడియోల్ విలన్ గా నటిస్తున్నాడు. మరి బాలయ్య కూడా సంక్రాంతికే ఖచ్చితంగా వస్తే మాత్రం వార్ మెగాస్టార్ వర్సెస్ నట సింహంగా మారుతుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com