Balakrishna : బాలయ్య మూవీ సంక్రాంతికి రావడం లేదా..?

Balakrishna :  బాలయ్య మూవీ సంక్రాంతికి రావడం లేదా..?
X

నందమూరి బాలకృష్ణ సినిమా సంక్రాంతి బరిలో ఉందంటే మిగతా మూవీస్ అన్నీ కాస్త జాగ్రత్తగా ఉండాలని చెబుతారు. బాలయ్య కెరీర్ లో సంక్రాంతి చాలా ఎక్కువగా కలిసొచ్చింది. ఆ టైమ్ లో వచ్చిన సినిమాల్లో దాదాపు బ్లాక్ బస్టర్సే ఎక్కువగా ఉన్నాయి. అందుకే సంక్రాంతి అంటే బాలయ్యదే అంటారు. అలా ఈ 2025 సంక్రాంతి బరిలో బాబీ డైరెక్షన్ లో రూపొందుతోన్న 109వ సినిమాను కూడా నిలుపుతున్నారు అనే టాక్స్ వచ్చాయి. ఇంకా అఫీషియల్ గా కన్ఫార్మ్ కాలేదు కానీ.. సంక్రాంతికి ఫిక్స్ అనే బలంగా వినిపించింది. బట్ లేటెస్ట్ గా వస్తోన్న వార్తలు వింటే బాలయ్య మూవీ సంక్రాంతికి వస్తుందా లేదా అనే అనుమానాలు కలుగుతున్నాయి.

ఈ అనుమానాలకు కారణం ఏంటీ అంటే.. ఈ చిత్రానికి సంబంధించి బాలయ్య ఇంకా 40 రోజుల వరకూ షూటింగ్ లో పాల్గొనాల్సి ఉందట. ఇప్పుడున్న పరిస్థితుల్లో అన్ని రోజులు షూట్ చేయడం అంత సులువు కాదు. పైగా అన్ స్టాపబుల్ షో కూడా స్టార్ట్ అయింది. గత రెండు రోజులుగా ఆ షూటింగ్ లోనే ఉన్నాడు. మరి మూవీకి 50 రోజులు అంటే పెద్ద మేటర్ కాదు కానీ.. సంక్రాంతికి రిలీజ్ అనేదే సాధ్యం అవుతుందా అనేది ప్రశ్న. ఎందుకంటే ఇంకా రెండు నెలలు మాత్రమే టైమ్ ఉంది. ఈ రెండు నెలల్లో ఎంత వేగంగా చిత్రీకరణ జరుపుకున్నా .. మిగిలిన 20 రోజుల్లోనే పోస్ట్ ప్రొడక్షన్ చేసి, ప్రమోషన్స్ తో ఆడియన్స్ ముందుకు రావడం అనేది బిగ్గెస్ట్ టాస్క్. అందుకే సంక్రాంతి బరిలో ఉండాలా వద్దా అనేది బాలయ్యే డిసైడ్ చేస్తాడు అంటున్నారు. అంటే ఆ రిలీజ డేట్ అనే బాల్ ఇప్పుడు బాలయ్య కోర్ట్ లో ఉందన్నమాట. ఆయన ఓకే అని బరిలోకి దిగితే పెద్ద కష్టం కాదు. అయినా సరే అనుమానాలు అలాగే ఉంటాయి అనేది నిజం.

Tags

Next Story