NBK with Power Star: పవన్ మూడు పెళ్లిళ్లు.. ఎన్‌బీకేలో క్లారిటీ!!

NBK with Power Star: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బాలకృష్ణ అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బికె షోలో పాల్గొన్నారు. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో ఈ వార్త ట్రెండ్ అవుతోంది. బాలయ్య బాబు ప్రశ్నలకు పవర్ స్టార్ ఎలాంటి సమాధానాలు ఇస్తారో అని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ షోలో పవన్ కళ్యాణ్ పెళ్లిళ్ల ప్రస్తావన తీసుకు వస్తున్నట్లు తెలుస్తోంది. ఆయన మూడు పెళ్లిళ్ల ఇష్యూకి ముగింపు పలకడానికి అన్‌స్టాపబుల్ వేదిక కానుందని సమాచారం.
పవన్ కళ్యాణ్ ఎందుకు మూడు పెళ్లిళ్లు చేసుకోవాలో ఈ షోలో క్లారిటీ ఇచ్చినట్లు తెలుస్తోంది. బాలకృష్ణ కొన్ని సూటి ప్రశ్నలు వేయగా, దానికి జనసేనాని గట్టిగానే సమాధానాలు ఇచ్చారట.
బాలకృష్ణ.. పవన్ వ్యక్తిగత ప్రశ్నలు అడగరని మొదట్లో వార్తలు వచ్చాయి. కానీ పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితం చుట్టూ ఉన్న ఊహాగానాలు, విమర్శలు మరియు అనవసరమైన వ్యాఖ్యానాలకు ముగింపు పలికేందుకు ఈ షోను మాధ్యమంగా ఉపయోగిస్తున్నట్లు కనిపిస్తోంది.
పవన్ కళ్యాణ్ తన వ్యక్తిగత జీవితంపై, ముఖ్యంగా తన పెళ్లిళ్లపై క్లారిటీ ఇచ్చిన తర్వాత, బాలకృష్ణ పవర్‌స్టార్‌ను మెచ్చుకున్నారట. ఇకపైనా ఇలాంటి విమర్శలకు ముగింపు పలకాలని బాలయ్యతో పాటు పవన్ అభిమానులూ కోరుకుంటున్నారు.
మూడు పెళ్లిళ్లు చేసుకున్నారనే కారణంతో నేతలు పవన్ కల్యాణ్‌ని నిత్యం టార్గెట్ చేస్తున్నారు. ఇటీవల, ఒక పబ్లిక్ ఈవెంట్‌లో, పవన్ దీనిపై మౌనం వీడారు. అయినా పవన్ ఈ టాక్ షోలో దీనిపై సుదీర్ఘంగా మాట్లాడినట్లు తెలుస్తోంది.
మరి ఈ ఎపిసోడ్ బయటికి వచ్చిన తర్వాత నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి. ఎపిసోడ్ ఎప్పుడు స్ట్రీమ్ అవుతుందో అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com