Naga Chaitanya : నాగ చైతన్య కొత్త సినిమా మొదలుపెట్టాడు

యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య కొత్త సినిమా ప్రారంభం అయింది. తండేల్ కు ముందు సరైన విజయం లేక ఇబ్బంది పడ్డాడు చైతన్య. తండేల్ కోసం రెండేళ్లకు పైగా టైమ్ కేటాయించాడు. సాయి పల్లవి హీరోయిన్ గా నటించిన ఈ మూవీ బిగ్ హిట్ గా నిలిచింది. 100 కోట్ల క్లబ్ లో చేరింది. దీంతో రెట్టించిన ఉత్సాహంతో తన 24వ సినిమాకు సిద్ధమయ్యాడు. ఈ మూవీ గతంలోనే అఫీషియల్ గా అనౌన్స్ అయింది. లేటెస్ట్ గా ప్రారంభం అయింది.
విరూపాక్షతో ఓవర్ నైట్ ప్రతి ఒక్కరూ తనను చూసేలా చేసుకున్న దర్శకుడు కార్తీక్ వర్మ దండు డైరెక్ట్ చేస్తోన్న ఈ చిత్రం నాగ చైతన్య కెరీర్లోనే 100 కోట్ల బిగ్గెస్ట్ బడ్జెట్ తో రూపొందుతోంది. మైథలాజికల్ థ్రిల్లర్ గా రూపొందబోతోంది. భారీ స్థాయిలో విజువల్ ఎఫెక్ట్స్ ను ఈ చిత్రం కోసం వాడబోతున్నారట. అందుకే బడ్జెట్ కూడా భారీగా ఉంటుంది అంటున్నారు. అనౌన్స్ మెంట్ టైమ్ లో రిలీజ్ చేసిన పోస్టర్ కే అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. దర్శకుడు సుకుమార్ శిష్యుడు. అందుకే ఈ ప్రాజెక్ట్ నిర్మాణంలో సుకుమార్ కూడా భాగస్వామి అయ్యాడు. మరో నిర్మాతగా బివిఎస్ఎన్ ప్రసాద్ ఉండబోతున్నాడు.
ఇక ‘ఎన్.సి 24’ అనే వర్కింగ్ టైటిల్ తో స్టార్ట్ అయిన ఈ చిత్రం అన్నపూర్ణ స్టూడియోలో వేసిన భారీ సెట్స్ లో చిత్రీకరణ మొదలైంది. మరి ఈ చిత్రంతో నాగ చైతన్య తండేల్ ను మించే హిట్టు కొడతాడా అనేది చూడాలి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com