'నరసింహ'లో నీలాంబరి.. ఆ నటి తిరస్కరణతో రమ్యకృష్ణను వరించిన పాత్ర

రమ్య కృష్ణ నీలాంబరి పాత్రను సినిమాలో అత్యంత శక్తివంతమైన నటనగా పరిగణించినప్పటికీ, ఆ పాత్రను ఎలా పోషించారనే దానిపై చాలా మంది అభిమానులు ఎల్లప్పుడూ ఆసక్తిగా ఉంటారు. ఇటీవల, రజనీకాంత్ ఒక ఆసక్తికరమైన విషయాన్ని పంచుకున్నారు, ఇది సినీ ప్రేమికులలో ఉత్సాహాన్ని నింపింది.
కొన్ని పాత్రలకోసమే కొందరు పుడతారేమో అన్నంత బాగా నటించింది రమ్యకృష్ణ నీలాంబరిగా నరసింహ సినిమాలో. అసలు ఆమె కాకుండా మరెవరినీ ఆ పాత్రలో ఊహించుకోలేం. అంతబాగా నటించింది. ఆ సినిమాలో రజనీకాంత్ తో సమానంగా పేరు సంపాదించుకుంది రమ్యకృష్ణ.
నీలాంబరికి అసలు ఎంపిక ఐశ్వర్యరాయ్
రజనీకాంత్ బృందం మొదటగా నీలాంబరి పాత్రలో నటించడానికి ఐశ్వర్య రాయ్ పేరును సూచించారు. ఆ పాత్రకు ఒక ప్రత్యేకతను తీసుకురావలనే ఉద్దేశంతో మేకర్స్ ఐశ్వర్యను తీసుకోవాలనుకున్నారు. అయితే, చివరికి పరిస్థితులు మారిపోయాయి.
ఐశ్వర్య తిరస్కరణ గురించి రజనీకాంత్ మాట్లాడుతూ, "ఐశ్వర్య రాయ్ నీలాంబరి పాత్రలో నటించాలని మేము కోరుకున్నాము. ఆమెను సంప్రదించడానికి ప్రయత్నించాము. ఆమె ఆ సినిమాకి ఓకే చెప్పి ఉంటే ఆమె కోసం నేను 2-3 సంవత్సరాలు కూడా వేచి ఉండటానికి సిద్ధంగా ఉన్నాను. ఆ పాత్ర క్లిక్ అవుతుందని మాకు బలమైన విశ్వాసం. అందుకే ఆమె కోసం నిరీక్షించాలనుకున్నాను. కానీ ఆమెకు ఆ పాత్రపట్ల ఆసక్తి లేదని మేము విన్నాము. శ్రీదేవి, మాధురి దీక్షిత్ ఇంకా అనేక మంది పేర్లు పరిశీలించబడ్డాయి. కానీ నీలాంబరి పాత్రలో అహంకారం కనిపించాలి. ఆఖరికి రమ్య కృష్ణ పేరును సూచించారు దర్శకుడు రవికుమార్." ఆయన ఎంపిక అస్సలు తప్పుకాలేదు. నూటికి నూరు పాళ్లు న్యాయం చేసింది నీలాంబరిగా రమ్యకృష్ణ అని అన్నారు రజనీకాంత్.
చివరికి రమ్య కృష్ణన్ ఆ పాత్రను పోషించి ఐకానిక్ గా నిలిచిన నటనను అందించింది. నీలాంబరి పాత్రలో ఆమె ఆత్మవిశ్వాసం ఆమెకు అపారమైన ప్రశంసలను తెచ్చిపెట్టింది. చాలా మంది అభిమానులు ఇప్పటికీ దీనిని ఆమె కెరీర్-బెస్ట్ పాత్రలలో ఒకటిగా భావిస్తారు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

