Neeraj Chopra Wins Gold : ప్రశంసలు కురిపించిన బాలీవుడ్ స్టార్స్

Neeraj Chopra Wins Gold : ప్రశంసలు కురిపించిన బాలీవుడ్ స్టార్స్
నీరజ్ చోప్రాపై బాలీవుడ్ తారగణం అభినందనల వెల్లువ

ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో భారత్‌కు తొలిసారిగా బంగారు పతకాన్ని అందించి నీరజ్ చోప్రా చరిత్ర సృష్టించాడు. హంగేరీలోని బుడాపెస్ట్‌లో జరిగిన పురుషుల జావెలిన్ త్రో ఫైనల్‌లో ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రీడాకారులతో పోటీ పడి, అతను తన రెండవ ప్రయత్నంలో 88.17 మీటర్ల విజయవంతమైన త్రోను సాధించాడు. అతని ఈ అసాధారణ విజయాన్ని ఇప్పుడు దేశం మొత్తం సెలబ్రేట్ చేసుకుంటోంది. ఈ నేపథ్యంలోనే దేశవ్యాప్తంగా అతన్ని పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు. అందులో భాగంగా బాలీవుడ్ స్టార్ యాక్టర్స్ కరీనా కపూర్ ఖాన్ , షాహిద్ కపూర్, ఆయుష్మాన్ ఖురానా , ఫర్హాన్ అక్తర్, మలైకా అరోరా, అభిషేక్ బచ్చన్, భూమి పెడ్నేకర్, విక్కీ కౌశల్, అనుష్క శర్మ వంటి తారలు కూడా నీరజ్ అసాధారణమైన ఫీట్ పై అభినందనలు తెలియజేశారు.

ఆగస్ట్ 28న ఉదయం, అథ్లెట్ నీరజ్ చోప్రా బంగారు పతకం సాధించినందుకు తమ ఆనందాన్ని, గర్వాన్ని వ్యక్తం చేస్తూ, చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు ఇన్ స్టాలో తమ అభినందనలు పంచుకున్నారు.

కరీనా కపూర్ ఖాన్ ఈ టోర్నమెంట్ నుండి నీరజ్ వీడియోను పంచుకున్నారు. "మీ గురించి చాలా గర్వంగా ఉంది @neeraj_chopra" అంటూ బంగారు పతకం, భారతీయ జెండా ఎమోజీలను షేర్ చేస్తూ వరల్డ్ ఛాంపియన్ అనే హ్యాష్ ట్యాగ్ ను జోడించారు.


షాహిద్ కపూర్.. నీరజ్ బంగారు పతకాన్ని పట్టుకుని ఉన్న చిత్రాన్ని పోస్ట్ చేసి, "మా ప్రపంచ ఛాంపియన్ @neeraj_chopra #Proudకి అభినందనలు" అని చెప్పాడు. దర్శకుడు ఫర్హాన్ అఖర్ కూడా ఇదే చిత్రాన్ని షేర్ చేస్తూ, "అభినందనలు (క్లాప్ ఎమోజీలు), @neeraj_chopra (గోల్డ్ మెడల్ ఎమోజి) @worldathletics #javelin" అని రాసుకువచ్చారు. విక్కీ కౌశల్ కూడా నీరజ్ పై ప్రశంసలు గుప్పించాడు. ఒలింపిక్స్ 2021, డైమండ్ లీగ్ 2022, ఇటీవలి ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్స్ 2023లో నీరజ్ విజయాల ఫొటోలను విక్కీ పంచుకున్నాడు.


"మరోసారి, నీరజ్ చోప్రా ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో పురుషుల జావెలిన్ త్రో పోటీలో స్వర్ణం సాధించడం మాకు గర్వంగా ఉంది" అని అభిషేక్ బచ్చన్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అలాగే అనుష్క శర్మ, మలైకా అరోరా కూడా సోషల్ మీడియా వేదికగా నీరజ్ చోప్రాను మెచ్చుకున్నారు. "భారతదేశానికి మరో గర్వకారణమైన విజయం. అభినందనలు నీరజ్ చోప్రా" అని చెప్పుకువచ్చారు. వారితో పాటు ఆయుష్మాన్ ఖురానా, భూమి పెడ్నేకర్ వంటి ఇతర ప్రముఖులు కూడా నీరజ్ చోప్రాను అభినందించారు.


Tags

Read MoreRead Less
Next Story