Neha Kakkar : ఇది ఇండియా కాదు.. వెళ్లిపో.. సింగర్ పై ఆడియన్స్ ఫైర్

Neha Kakkar :  ఇది ఇండియా కాదు.. వెళ్లిపో.. సింగర్ పై ఆడియన్స్ ఫైర్
X

ఇండియాలో సెలబ్రిటీస్ అంటే టైమ్ మెయిన్టేన్ చేయరు అనేది జగమెరిగిన సత్యం. ఫలానా టైమ్ కు వస్తారు అని చెబితే ఆ టైమ్ కు కనీసం తక్కువలో తక్కువ గంటైనా లేట్ గా వస్తారు. చాలామంది ఒక పూట ఆలస్యంగా వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. వారికి మేనేజర్స్ ఏదో చెబుతారు. వీరు అదే అనుకుంటారు. బట్ ఇవన్నీ అందరికీ తెలిసే జరుగుతాయనేది నిజం. కానీ పాశ్చాత్య దేశాల్లో అలా కుదరదు. టైమ్ అంటే టైమే. చాలా వెస్ట్రన్ కంట్రీస్ లో ప్రదాన మంత్రులు కూడా సింపుల్ గానే ఉంటారు. టైమ్ మెయిన్టేన్ చేస్తుంటారు. అలా చేయలేదని ఆస్ట్రేలియాలోని మెల్ బోర్న్ వేదికగా ఇండియన్ సింగర్ నేహా కక్కర్ పై అక్కడి ప్రేక్షకులు ఫైర్ అయ్యారు.

మెల్ బోర్న్ లో నిర్వహించిన ఓ కాన్సర్ట్ కు అటెండ్ కావాల్సిన నేహా కక్కర్ ఏకంగా మూడు గంటలు ఆలస్యంగా వచ్చింది. అంతే జనంలో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఇంత సేపు తమ టైమ్ వేస్ట్ చేసిందనే కారణంతో.. ‘ఇది ఇండియా కాదు.. గో బ్యాక్’అంటూ నినాదాలు చేశారు. ఇది ఊహించని నేహా.. వేదికపై గుక్క పట్టి ఏడ్చేసింది. నిర్వాహకులు వచ్చి సర్ది చెప్పినా ఆమె ఏడుపు ఆపలేదు. ఏదేమైనా ఓ పనికి కమిట్ అయినప్పుడు టైమ్ మెయిన్టేన్ చేయడమనేది సంస్కారం. అది లేని కళ కూడా సంస్కార రహితంగానే కనిపిస్తుంది. ఇదే ఇండియాలో అయితే మూడు గంటల తర్వాతైనా వచ్చింది కదా అదే పదివేలు అనుకుంటారేమో మనోళ్లు. ఇక్కడ ఆడియన్స్ లోనూ టైమ్ సెన్స్ ఉండదు కాబట్టే వారికి సాగిపోతుంది. అంతే.

Tags

Next Story