Neha Shetty: తీవ్ర విషాదంలో 'డీజే టిల్లు' హీరోయిన్.. హృదయం బద్దలయ్యింది అంటూ పోస్ట్..

Neha Shetty (tv5news.in)
Neha Shetty: టాలీవుడ్‌లో చిన్న సినిమాగా విడుదలయ్యి అందరి దృష్టిని ఆకర్షించింది డీజే టిల్లు. శుక్రవారం విడుదలయిన ఈ సినిమాకు అంతటా పాజిటివ్ రెస్పాన్స్ లభిస్తోంది. ఇందులో హీరోగా నటించిన సిద్ధు జొన్నలగడ్డ, హీరోయిన్ నేహా శెట్టిని ప్రేక్షకులు ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. ఇలాంటి సమయంలో నేహా శెట్టి ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. దీని గురించి ఈ హీరోయిన్ ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టింది.
నేహా శెట్టి ముందుగా పూరీ జగన్నాధ్ దర్శకత్వంలో వచ్చిన 'మెహబూబా' అనే చిత్రంతో హీరోయిన్‌గా పరిచయమయ్యింది. దాని తర్వాత సందీప్ కిషన్ హీరోగా తెరకెక్కిన 'గల్లీ రౌడీ' అనే చిత్రంలో చేసింది. తాజాగా అక్కినేని అఖిల్ నటించిన 'మెస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' చిత్రంలో ఓ కీలక పాత్ర పోషించింది. ఇక తన కెరీర్‌లో బిగ్గెస్ట్ బ్రేక్‌గా డీజే టిల్లు ఆఫర్ తన ముందుకు వచ్చింది.
యూత్‌కు బాగా కనెక్ట్ అయ్యే సినిమా కాబట్టి డీజే టిల్లు ఇప్పటికే హిట్ ట్రాక్ ఎక్కేసింది. ఇటీవల నేహా శెట్టి తన అమ్మమ్మను కోల్పోయింది. ఆమె గురించి చెప్తూ.. ఈ హీరోయిన్ ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టింది.
'నా అభిమాని, చీర్ లీడర్ నన్ను వదిలి వెళ్లిపోయింది. నేను రెండు సంవత్సరాల వయసులో ఉన్నప్పటి నుంచే నా పర్ఫామెన్స్ చూసేందుకు అవ్వ ఎప్పుడూ ముందు వరుసలో కూర్చునేది. అలాంటి అవ్వ.. ఇప్పుడు నా విజయంలో, సంతోషంలో పాలు పంచుకునేందుకు ఇక్కడ లేరని తలుచుకుంటేనే నా హృదయం ముక్కలవుతోంది. కానీ ఆమె ప్రేమ, ఆశీర్వాదాలు ఎప్పుడూ నాతోటే ఉంటాయి. ఐ లవ్ యూ అవ్వా, డీజే టిల్లు విజయాన్ని నీకు అంకితం ఇస్తున్నాను' అని తన అవ్వ ఫోటోను పోస్ట్ చేసింది నేహా.
Neha Shetty:
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com