Neha Shetty: 'నిజంగానే హీరోయిన్ పుట్టుమచ్చలను లెక్కపెట్టారా?' అన్న ప్రశ్నకు నేహా శెట్టి రిప్లై..

Neha Shetty (tv5news.in)

Neha Shetty (tv5news.in)

Neha Shetty: డీజే టిల్లు ట్రైలర్‌లో హీరో, హీరోయిన్‌ని ‘నీ ఒంటిపై ఎన్ని పుట్టుమచ్చలు ఉన్నాయి’ అని అడిగే ఓ డైలాగు ఉంటుంది.

Neha Shetty: ప్రస్తుతం టాలీవుడ్‌లో యంగ్ హీరోల హవా జోరుగా సాగుతోంది. సినిమా కథలో కంటెంట్ ఉందని ప్రేక్షకులు నమ్మితే చాలు.. అందులో హీరో ఎవరు, సినిమా ఎంత బడ్జెట్‌తో తెరకెక్కించారు అన్న విషయాలను కూడా పట్టించుకోవడం మానేశారు. అందుకే చాలావరకు యంగ్ హీరోల సినిమాల గురించి ఆడియన్స్ ఎదురుచూస్తున్నారు. అందులో ఒక సినిమానే 'డీజే టిల్లు'.

సిద్ధు జొన్నలగొడ్డ.. యూత్‌పుల్ సినిమాలు చేయడానికి ఈ హీరో ఎక్స్‌పర్ట్. తాను నటించిన సినిమాలన్నీ దాదాపుగా యూత్‌ను ఆకట్టుకునేలా ఉంటాయి. అందుకే మరోసారి డీజే టిల్లు లాంటి ఓ యూత్‌ఫుల్ స్టోరీతో ప్రేక్షకుల ముందుగా వస్తున్నాడు సిద్ధు. ఇటీవల ఈ సినిమా ట్రైలర్ లాంచ్ గ్రాండ్‌గా జరిగింది. కానీ ఈ లాంచ్‌లో మూవీ టీమ్‌కు ఓ చేదు అనుభవం ఎదురయ్యింది.

'డీజే టిల్లు' ట్రైలర్‌లో హీరో సిద్ధు, హీరోయిన్ నేహా శెట్టిని 'నీ ఒంటిపై ఎన్ని పుట్టుమచ్చలు ఉన్నాయి' అని అడిగే ఓ డైలాగు ఉంటుంది. అయితే ఆ డైలాగును దృష్టిలో పెట్టుకుని 'ట్రైలర్‌లో ఆమెకు 16 పుట్టుమచ్చలు ఉన్నాయన్నారు. మరి నిజంగా హీరోయిన్‌కు ఎన్ని పుట్టుమచ్చలు ఉన్నాయో తెలుసుకున్నారా?' అని ప్రశ్నించారు ఓ వ్యక్తి. దానికి మూవీ టీమ్ అంతా ఒక్కసారిగా సైలెంట్ అయిపోయింది. హీరో సిద్ధు మాత్రం తాను ఆ ప్రశ్నకు సమాధానం చెప్పనని వెల్లడించాడు.

ఆ వ్యక్తి ప్రశ్నను మరచిపోలేని హీరోయిన్ నేహా శెట్టి. దీనిపై ట్విటర్ వేదికగా స్పందించారు. 'ఈరోజు జరిగిన ట్రైలర్ లాంచ్‌లో ఇలాంటి ప్రశ్న ఎదురవ్వడం దురదృష్టకరం. కానీ నేను కచ్చితంగా చెప్పాలనుకుంటుంది ఏంటంటే.. ఇది తనపట్ల, తన చుట్టూ ఉండే మహిళలపట్ల తనకు ఎలాంటి గౌరవం ఉందో చూపిస్తుంది' అంటూ మండిపడింది. ఈ ట్వీట్‌పై నిర్మాత నాగవంశీ కూడా స్పందిస్తూ.. నేహాకు సారీ చెప్పాడు.


Tags

Read MoreRead Less
Next Story