Neha Shetty: 'ఇదంతా ఎలా ఉందో మాటల్లో చెప్పలేను'.. నేహా శెట్టి ఎమోషనల్ పోస్ట్..

Neha Shetty (tv5news.in)

Neha Shetty (tv5news.in)

Neha Shetty: సిద్ధు జొన్నలగడ్డ, నేహా శెట్టి.. ఇద్దరికీ డీజే టిల్లుతో నూటికి నూరు మార్కులు పడ్డాయి.

Neha Shetty: ఒకప్పుడు చిన్న సినిమాలకు పెద్దగా ఆదరణ లభించేది కాదు.. కానీ ఇప్పుడు అలా కాదు. ప్రేక్షకులు కూడా అన్ని విధాలుగా ఆలోచించడం మొదలుపెట్టారు. తక్కువ బడ్జెట్ చిత్రం అయినా.. కంటెంట్ బాగుంటే దానికి హిట్ అని మార్కులు వేసేస్తున్నారు. తాజాగా 'డీజే టిల్లు'కు కూడా అలాగే వేశారు. ఓ చిన్న సినిమాగా విడుదలయిన డీజే టిల్లు థియేటర్లలోనే కాదు ఓటీటీలో కూడా హవా కొనసాగిస్తోంది.

సిద్ధు జొన్నలగడ్డ, నేహా శెట్టి.. ఇద్దరికీ డీజే టిల్లుతో నూటికి నూరు మార్కులు పడ్డాయి. అందుకే ప్రేక్షకులంతా ఈ సినిమాను సూపర్ డూపర్ హిట్ చేశారు. ఈ ఏడాది విడుదయిన చిన్న సినిమాల్లో ఎక్కువశాతం ప్రేక్షకులకు నచ్చిన సినిమాగా రికార్డ్ సొంతం చేసుకుంది డీజే టిల్లు. అయితే ఈ సినిమాలో 'రాధిక'గా మెప్పించిన నేహా శెట్టి డీజే టిల్లు గురించి ఎమోషనల్ పోస్ట్ అందరి దృష్టిని ఆకర్షించింది.

'టిల్లు రాధికను నమ్మలేదు కానీ మీరు నమ్మారు. మీరు రాధికను యాక్సెప్ట్ చేశారు. మీ అందరినీ రాధిక చాలా ఇష్టపడుతోంది. డీజే టిల్లును ఇంత పెద్ద సక్సెస్ చేసినందుకు చాలా థాంక్యూ. మీ ప్రేమ, సపోర్ట్ లేకుండా ఇదంతా జరిగేది కాదు. నేను ఎక్కడికి వెళ్లినా అందరూ రాధిక రాధిక అని పిలుస్తున్నారు. ఇదంతా ఎలా ఉందో మాటల్లో చెప్పలేను.' అంటూ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది నేహా శెట్టి.

Tags

Read MoreRead Less
Next Story