Pawan Kalyan : పవన్ కళ్యాణ్ మూవీలో టిల్లు బ్యూటీ

Pawan Kalyan :  పవన్ కళ్యాణ్ మూవీలో టిల్లు బ్యూటీ
X

డిజే టిల్లులో రాధికగా తెలుగు ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టిన బ్యూటీ నేహాశెట్టి. అంతకు ముందే టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చిన ఈ కన్నడ సోయగానికి టిల్లు మంచి బూస్టప్ ఇచ్చింది కానీ దాన్ని నిలబెట్టుకోవడంలో ఫెయిల్ అయింది. ఈ యేడాది వచ్చిన టిల్లు స్క్వేర్ లో గెస్ట్ అప్పీరియన్స్ ఇచ్చింది. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరిపై చాలా ఆశలే పెట్టుకుంది. కానీ అది బాక్సాఫీస్ వద్ద ఢమాల్ అంది. టాలెంట్ తో పాటు స్కిన్ షో విషయంలోనూ ఏ అభ్యంతరాలూ లేకపోయినా ఎందుకో నేహాశెట్టికి తగిన ఆఫర్స్ రావడం లేదు. బట్ లేటెస్ట్ గా అమ్మడికి ఓ బంపర్ ఆఫర్ వచ్చింది. అది కూడా పవన్ కళ్యాణ్ మూవీలో కావడం విశేషం.

పవర్ స్టార పవన్ కళ్యాణ్ హీరోగా లాస్ట్ ఇయర్ స్టార్ట్ అయిన మూవీ 'ఓ.జి'. ఒరిజినల్ గ్యాంగ్ స్టర్ అనేది అసలు పేరు. సాహో ఫేమ్ సుజిత్ డైరెక్ట్ చేస్తోన్న ఈమూవీ పవన్ పొలిటికల్ షెడ్యూల్స్ కారణంగా లేట్ అయింది. ఆయన ఓ 15 రోజులు టైమ్ ఇస్తే పూర్తవుతుంది. ఇప్పటికే మిగతా భాగం అంతా కంప్లీట్ చేశాడట సుజిత్. అయితే ఈ మూవీలో ఓ స్పెషల్ సాంగ్ చేసే అవకాశం వచ్చింది నేహాశెట్టి. తాజాగా ఆ పాటను చిత్రీకరిస్తున్నారు. స్పెషల్ సాంగ్స్ అంటే హీరోలు ప్రతిసారీ ఉండరు. మరి ఈ పాట పవన్ కళ్యాణ్ తో పాటుగా సాగుతుందా లేక ఆయన లేకుండానే ఉంటుందా అనేది తెలియదు కానీ.. ఈ ఆఫర్ నేహాశెట్టికి చాలా వరకూ ప్లస్ అయ్యే అవకాశం ఉంది.

Tags

Next Story