Nenu Meeku Baga Kavalasina Vadini: యాక్షన్, కామెడీ, రొమాన్స్ అన్నీ సమపాళ్లలో.. 'నేను మీకు బాగా కావాల్సినవాడిని' ట్విట్టర్ రివ్యూ

Nenu Meeku Baga Kavalasina Vadini: కిరణ్ అబ్బవరం గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. కొత్తవాడైనా మార్కెట్‌లో మంచి పేరు తెచ్చుకున్నాడు. రాజా వారు రాణి గారు సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు. ఆపై బాక్సాఫీస్ వద్ద మంచి హిట్ అందుకున్న చిత్రం 'SR కళ్యాణ మండపం'. ఇక ఆ సినిమా హిట్ వరుస అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి.
తన తదుపరి చిత్రం 'సెబాస్టియన్' డిజాస్టర్ అయినప్పటికీ వెంటనే 'సమ్మతమేతో' బ్యాలెన్స్ చేశాడు. తాజాగా 'నేను మీకు బాగా కావాల్సిన వాడిని' శుక్రవారం థియేటర్లలో విడుదలైంది. ఈ సినిమాపై కిరణ్ ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. మరో హిట్ కొట్టాలని తహతహలాడుతున్నాడు. ఇప్పటికే సినిమా చూసిన ప్రేక్షకులు ట్విట్టర్ ద్వారా తమ రివ్యూని పంచుకున్నారు.
ఇది ఒక యాక్షన్, హాస్యం మరియు రొమాన్స్ అన్నీ సమపాళ్లలో కలగలిసిన ఒక ఆహ్లాదకరమైన మాస్ ఎంటర్‌టైనర్‌గా అభివర్ణిస్తున్నారు ప్రేక్షకులు. ట్రైలర్‌లో కిరణ్ అబ్బవరం.. పురుషులు ఎటువంటి కారణం లేకుండా తాగవచ్చు, కానీ ఒక స్త్రీ తాగితే దానికి చాలా కారణాలు ఉంటాయి అని అతడు చెప్పిన డైలాగ్ ఆకట్టుకుంది. అప్పుడే సినిమాపై అంచనాలు పెంచేసింది. రెండున్నర గంటలు ఆడియన్స్‌కి బోరు కొట్టనివ్వకుండా ఎంజాయ్ చేయించాడు కిరణ్ అని ఈ సినిమాపై ప్రేక్షకులు ట్విట్టర్ ద్వారా తమ అభిప్రాయాన్ని పంచుకుంటున్నారు.
ఈ చిత్రంలో కిరణ్ అబ్బవరం, సంజనా ఆనంద్, సోనూ ఠాకూర్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి రచయిత కూడా కిరణ్ అబ్బవరం కావడం విశేషం. శ్రీధర్ గాధే దర్శకత్వం వహించగా, మణిశర్మ స్వరాలు సమకూర్చారు.
కిరణ్ రాబోయే చిత్రాలు..వినరో భాగ్యం విష్ణు కథ, మీటర్, రూల్స్ రంజన్.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com