Pradeep Ranganathan : ఇదీ ఆ కుర్రాడి కెపాసిటీ

ఎప్పుడొచ్చామని కాదు.. బుల్లెట్ దిగిందా లేదా అనే సినిమా డైలాగ్ ఉంది కదా.. అది సినిమా ఇండస్ట్రీలోనే ఎప్పుడూ జరుగుతూ ఉంటుంది. ఎప్పటి నుంచో ఉన్న హీరోల కంటే సడన్ గా వచ్చిన కుర్రాళ్లు అదరగొడుతుంటారు. పైగా వీళ్లు లాంగ్వేజ్ బారికేడ్స్ ను కూడా బద్ధలు కొడతారు. అలాంటి కుర్రాడే ప్రదీప్ రంగనాథన్. ఆ మధ్య వచ్చిన లవ్ టుడే సినిమాతో తమిళ్ ఆడియన్స్ ను మెప్పించి అదే మూవీ డబ్బింగ్ వెర్షన్ తో తెలుగు ప్రేక్షకులనూ ఆకట్టుకున్నాడు. ఈ యేడాది డ్రాగన్ తో రెండు భాషల్లోనూ బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. కుర్రాడు మంచి దర్శకుడు కూడా. అందుకే కంటెంట్ వాల్యూ తెలిసి ఆ తరహా కథలే సెలెక్ట్ చేసుకుంటున్నాడు. ప్రస్తుతం స్ట్రయిట్ గా తెలుగులోనే మైత్రీ బ్యానర్ లో సినిమా చేస్తున్నాడు. కీర్తిశ్వరన్ డైరెక్ట్ చేస్తోన్న ఈ చిత్రంలో మమిత బైజు హీరోయిన్ గా నటిస్తోంది. తాజాగా ఈ మూవీ ఓటిటి డీల్ పూర్తయింది. ఈ డీల్ గురించి టాలీవుడ్ లోనే కాదు.. కోలీవుడ్ లో కూడా హాట్ హాట్ గా మాట్లాడుకుంటున్నారు. కారణం ఆ డీల్ ఖరీదు 25 కోట్లు. ఈ ఫిగర్ తో నెట్ ఫ్లిక్స్ సంస్థ డూడ్ మూవీ ఓటిటి రైట్స్ ను దక్కించుకుంది.
యస్.. రెండో సినిమాకే వంద కోట్ల క్లబ్ లో చేరిన హీరోకు ఈ మాత్రం ఉండొద్దా అనుకుంటున్నారేమో. కానీ అది నిజం కాదు. ఎందుకంటే వంద కోట్లు అనేది ఓటిటి క్రైటీరియాగా తీసుకోదు. ఆ హీరో ఫ్యూచర్ ను కూడా క్రైటీరియాగా తీసుకుంటుంది. అతని కేపబిలిటీని అంచనా వేస్తుంది. అతను ఎంచుకునే కథల గురించి అవగాహనతో ఉంటుంది. వీటికి తోడు బ్యానర్ వాల్యూ కూడా ఉంటుంది. ఏదేమైనా తెలుగుతో పాటు తమిళ్ లోనూ నెపో హీరోస్ చాలామంది ఇండస్ట్రీకి వచ్చి దశాబ్దం దాటిన వారు కూడా ఈ ఫిగర్ కు చాలా దూరంలోనే ఉండిపోయారు. అందుకే ఇది ఆ కుర్రాడి కెపాసిటీగానే చూడాలి.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com