Nivetha Pethuraj: 'ఆర్ఆర్ఆర్‌లో బెస్ట్ యాక్టింగ్ ఎవరిది?' అన్న ప్రశ్నకు హీరోయిన్ స్మార్ట్ రిప్లై..

Nivetha Pethuraj: ఆర్ఆర్ఆర్‌లో బెస్ట్ యాక్టింగ్ ఎవరిది? అన్న ప్రశ్నకు హీరోయిన్ స్మార్ట్ రిప్లై..
Nivetha Pethuraj: తాజాగా నివేదా పేతురాజ్‌ సోషల్ మీడియాలో ప్రశ్న, సమాధానాల సెషల్ నిర్వహించింది.

Nivetha Pethuraj: రాజమౌళి తెరకెక్కించిన 'ఆర్ఆర్ఆర్' సినిమా దేశవ్యాప్తంగానే కాదు.. ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. కలెక్షన్ల విషయంలోనే కాదు.. ప్రేక్షకుల దగ్గర నుండి పాజిటివ్ రెస్పాన్స్ సంపాదించుకోవడంలో కూడా ఈ సినిమా విజయాన్ని సాధించింది. తాజాగా ఆర్ఆర్ఆర్ సినిమాలో బెస్ట్ యాక్టింగ్ ఎవరిది అని ఓ హీరోయిన్‌ను ప్రశ్నించాడు నెటిజన్. దానికి తను ఇచ్చిన రిప్లై సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

రామ్ చరణ్, ఎన్‌టీఆర్ కెరీర్‌ల్లో ఎన్నో మంచి సినిమాలు ఉన్నా.. ఆర్ఆర్ఆర్‌లో వీరు చేసిన నటన వేరే లెవెల్ అని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. అంతే కాకుండా ఎంతోమంది ప్రేక్షకులు కూడా ఇదే మాట అన్నారు. సినీ సెలబ్రిటీలు సైతం ఎన్‌టీఆర్, రామ్ చరణ్ తమ కెరీర్‌లోనే బెస్ట్ పర్ఫార్మెన్స్ చేశారని ప్రశంసించారు. అయితే తమిళ బ్యూటీ నివేదా పేతురాజ్‌కు ఎవరి యాక్టింగ్ నచ్చిందని ప్రశ్నించగా తన స్మార్ట్ రిప్లైకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు.


సోషల్ మీడియాలో కొందరు నటీనటులు ఎక్కువగా యాక్టివ్‌గా ఉంటారు. అందులో తమిళ బ్యూటీ నివేదా పేతురాజ్ కూడా ఒకరు. 'చిత్రలహరి', 'అల వైకుంఠపురంలో' లాంటి సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న నివేదా.. ప్రస్తుతం తెలుగులో 'బ్లడీ మేరీ' అనే వెబ్ మూవీలో నటిస్తోంది.


తాజాగా తాను సోషల్ మీడియాలో ప్రశ్న, సమాధానాల సెషల్ నిర్వహించింది. అందులో 'ఆర్ఆర్ఆర్‌లో బెస్ట్ యాక్టింగ్ ఎన్‌టీఆరా? రామ్ చరణా?' అని ఓ నెటిజన్ అడిగాడు. దానికి నివేదా స్మార్ట్‌గా 'ఉక్రెయిన్, రష్యా వార్ స్టార్ట్ చేసింది మీరే కదా' అని సమాధానం ఇచ్చింది. ఈ స్మార్ట్ రిప్లైకు నెటిజన్లు ఫిదా అవ్వడంతో పాటు దీనిపై ఎన్నో మీమ్స్ కూడా వచ్చాయి.

Tags

Read MoreRead Less
Next Story