కొడుకును దారిలో పెట్టలేనివాడివి.. మాకేం పాఠాలు చెప్తావ్: షారుక్‌‌కి షాక్

కొడుకును దారిలో పెట్టలేనివాడివి.. మాకేం పాఠాలు చెప్తావ్: షారుక్‌‌కి షాక్
కొడుకు చేసిన పనికి తండ్రి తలెత్తుకోలేకపోతున్నాడు.. ఇంతకు ముందు వ్యవహారం నలుగురు మధ్యే ఉండేది ఏది జరిగినా..

కొడుకు చేసిన పనికి తండ్రి తలెత్తుకోలేకపోతున్నాడు.. ఇంతకు ముందు వ్యవహారం నలుగురు మధ్యే ఉండేది ఏది జరిగినా.. కానీ ఇప్పుడు సోషల్ మీడియా పుణ్యమా అని నలభై కోట్ల మందికైనా నాలుగు నిమిషాల్లో తెలిసిపోతుంది. మంచైతే ఆకాశానికి ఎత్తేస్తున్నారు.. చెడైతే చీల్చి చెండాడేస్తున్నారు.. పోలీసుల ఇన్వాల్ మెంట్ లేకుండానే పనిష్మెంట్లు ఇచ్చేస్తున్నారు నెటిజన్లు..

ప్రస్తుతం బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ పరిస్థితి కూడా అదే. కొడుకు ఆర్యన్ ఖాన్‌ డ్రగ్స్ కేసులో అడ్డంగా దొరికిపోయాడు.. క్రూయిజ్ నౌకలో రేవ్ పార్టీ చేసుకుంటే తనను తాను మర్చిపోయాడు. మత్తు పదార్దాలకు అలవాటు పడి మస్తు ఎంజాయ్ చేస్తున్నాడు.

ఈ నేపథ్యంలో పిల్లల్ని సరిగ్గా పెంచడం చేతకాని షారుక్.. ఓ మేధావి క్యారెక్టర్‌లో బైజూస్ యాడ్‌లో నటించడం, పిల్లల విషయంలో పెద్దలకు పాఠాలు చెప్పడం, సలహాలు ఇవ్వడం మింగుడు పడని అంశమని నెటిజన్లు విమర్శిస్తున్నారు. దీంతో బైజూస్ రంగంలో దిగిందని జాతీయ మీడియా కథనం.

మరోవైపు మరికొన్ని బ్రాండ్‌లు సైతం ఈ ఇష్యూని సీరియస్‌గా తీసుకుని షారుక్‌ని తప్పించేందుకు పావులు కదుపుతున్నాయి. కొన్నేళ్లుగా సినిమాల్లో సక్సెస్ చూడని షారుఖ్‌కి కొడుకు వ్యవహారం మింగుడు పడని అంశంగా మారింది. కొడుకు కోట్లలో నష్టాన్ని తీసుకురావడమే కాక.. పేరు కూడా చెడగొడుతున్నాడని లోలోపల షారుఖ్ మదన పడుతున్నాడు.

Tags

Read MoreRead Less
Next Story