Ram Gopal Varma: రూ.లక్ష రివార్డ్ అంటూ ఆర్జీవీ ట్వీట్.. 'ఆచార్య'కు ఇన్‌డైరెక్ట్ కౌంటర్..?

Ram Gopal Varma: రూ.లక్ష రివార్డ్ అంటూ ఆర్జీవీ ట్వీట్.. ఆచార్యకు ఇన్‌డైరెక్ట్ కౌంటర్..?
Ram Gopal Varma: ఆచార్యలో ఫ్లాష్ బ్యాక్ సీన్లు నెట్టింట్లో వైరల్ అవ్వడంతో పాటు ట్రోల్ అవుతున్నాయి.

Ram Gopal Varma: రామ్ గోపాల్ వర్మ ట్వీట్లకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. తనకు నచ్చిన విషయమయినా.. నచ్చని విషయమయినా.. ఏదో ఒక విధంగా స్పందిస్తూనే ఉంటాడు వర్మ. ఒక్కొక్కసారి తాను డైరెక్ట్‌గా కౌంటర్లు వేస్తే.. ఒక్కొక్కసారి ఇన్‌డైరెక్ట్‌గా కౌంటర్లు వేస్తుంటాడు. తాజాగా రామ్ గోపాల్ వర్మ చేసిన ఓ ట్వీట్.. 'ఆచార్య'కు ఇన్‌డైరెక్ట్ కౌంటరేమో అనుకుంటున్నారు నెటిజన్లు.

రామ్ చరణ్, చిరంజీవి మల్టీ స్టారర్‌గా తెరకెక్కిన 'ఆచార్య'.. ఎన్నో అంచనాల మధ్య విడుదలయ్యింది. కొరటాల శివ డైరెక్షన్, మెగా హీరోల మల్టీ స్టారర్ అనే అంశాలు సినిమాలకు బాగా హైప్‌ను తెచ్చిపెట్టాయి. కానీ ఈ క్రేజ్ అంతా ఒక్కరోజు కూడా లేదు. మొదటిరోజు నుండే సినిమాపై నెగిటివ్ టాక్ రావడం మొదలయ్యింది. ముఖ్యంగా ఆచార్యలోని ఓ సీన్ సోషల్ మీడియాలో తెగ ట్రోల్ అవుతోంది.

ఆచార్యలో ఫ్లాష్ బ్యాక్ సీన్లు నెట్టింట్లో వైరల్ అవ్వడంతో పాటు ట్రోల్ అవుతున్నాయి. ఇందులో గ్రాఫిక్స్ చాలా దారుణంగా ఉన్నాయంటూ ప్రేక్షకులు కామెంట్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా రామ్ గోపాల్ వర్మ ఇటీవల ఓ ట్వీట్ చేశారు.

'నేను ఈ ఎక్స్‌ప్రెషన్ పెట్టడానికి కారణం ఏంటో చెప్పినవారికి రూ.లక్ష క్యాష్ ప్రైజ్' అంటూ ఓ ఫోటోను పోస్ట్ చేశారు వర్మ. అయితే దానికి సమాధానంగా ఒక నెటిజన్ ఆచార్యలోని ఫ్లాష్ బ్యాక్ సీన్ ఫోటో పెట్టి 'ఈ సీన్ రియాక్షనే కదా' అంటూ రిప్లై ఇచ్చాడు. దీంతో నిజంగానే వర్మ.. ఆచార్య సినిమాలోని ఆ సీన్‌కు కౌంటర్ ఇచ్చాడా అని చర్చించుకుంటున్నారు కొందరు.



Tags

Next Story