Hanuman vs Adipurush: హనుమాన్‌ వర్సెస్ ఆదిపురుష్.. ట్రోల్స్ మామూలుగా లేవుగా

Hanuman vs Adipurush: హనుమాన్‌ వర్సెస్ ఆదిపురుష్.. ట్రోల్స్ మామూలుగా లేవుగా
Hanuman vs Adipurush: అసలే తమ సినిమాకు విపరీతమైన విమర్శలు వచ్చాయి. ఆ బాధలో ప్రాబ్లమ్ ను క్లియర్ చేసుకునే పనిలో ఉందో మూవీ టీమ్.

Hanuman vs Adipurush: అసలే తమ సినిమాకు విపరీతమైన విమర్శలు వచ్చాయి. ఆ బాధలో ప్రాబ్లమ్ ను క్లియర్ చేసుకునే పనిలో ఉందో మూవీ టీమ్. వాళ్లు డ్యామేజ్ కంట్రోల్ లో ఉండగా ఇప్పుడు మరో సినిమా వచ్చి.. మళ్లీ వారిపై విమర్శలకు కారణమైంది. అది కూడా బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ పై ఓ స్మాల్ మూవీ టీమ్ చేసిన దండయాత్రలా కనిపిస్తోంది.



సినిమా ఇండస్ట్రీలో మాత్రమే సాధ్యమయ్యే ఈ కథలు కొత్తగా అనిపించకపోయినా.. అప్పటికి మాత్రం హాట్ గా ఉంటాయి. ఇంతకీ ఇది ఏ సినిమాల గురించో ఊహించారు కదా..? యస్.. ప్రభాస్ ఆదిపురుష్‌ సినిమాపై మరిన్ని కమెంట్స్ కు కారణమైంది.. లేటెస్ట్ గా వచ్చిన హనుమాన్ టీజర్.


బాహుబలితో ప్యాన్ ఇండియన్ స్టార్ అయ్యాడు ప్రభాస్. తర్వాత రెండు సినిమాలు యావరేజ్ అనిపించుకున్నా.. అతని క్రేజ్ తగ్గలేదు. ఇంకా చెబితే రాబోయే సినిమాలతో గ్లోబల్ స్టార్ అవుతాడు. అలాంటి ప్రభాస్ నుంచి రామాయణం ఆధారంగా రూపొందిన ఆదిపురుష్‌ వస్తోందంటే అంతా ఆసక్తిగా చూశారు.



వారి ఇంట్రెస్ట్ నంతా నీరుగార్చేలా.. ఆదిపురుష్‌ టీజర్ తోనే అందరికీ షాక్ ఇచ్చాడు దర్శకుడు ఓమ్ రౌత్. ఓ లోకల్ చానల్ కూడా అంత నాసిరకమైన గ్రాఫిక్స్, విజువల్ ఎఫెక్ట్స్ కనిపించవు. అంత దారుణంగా ఉన్నాయి గ్రాఫిక్స్. దీంతో సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో సెటైర్స్ పడ్డాయి.



ఫ్యాన్స్ కూడా ఏ మాత్రం వెనకేసుకురాలేదు. త్రీడీలో బావున్నాయని కవర్ చేసినా జనం నమ్మలేదు. దీంతో మొత్తం టీమ్ వెనక్కి తగ్గ ఏకంగా మళ్లీ రీ షూట్స్ తో పాటు గ్రాఫిక్స్, విజువల్ ఎఫెక్ట్స్ ను కొత్తగా ప్లాన్ చేసుకుంటున్నారు. ఇందుకోసం ఏకంగా సినిమానే ఆరు నెలలకు పైగా పోస్ట్ పోన్ చేశారు.


ఇక ఆదిపురుష్‌ మూవీ టీమ్ విమర్శలను దాటుకుని కొత్తగా ముస్తాబవుతోన్న వేళ సడెన్ గా వచ్చిన హనుమాన్ టీజర్ మళ్లీ వారిపై ట్రోల్స్ ను పెంచింది. హనుమాన్ చిన్న సినిమా అని చాలామంది భావించారు. కానీ ఇది చాలా పెద్ద మూవీ అని టీజర్ తోనే తేలిపోయింది.



వీళ్లు కూడా పాన్ ఇండియన్ రేంజ్ లో రిలీజ్ చేయబోతున్నారు. వారికి టీజర్ నుంచే ఆల్ ఆడియన్స్ నుంచి అప్లాజ్ వచ్చింది. అయితే అందరూ హనుమాన్ టీజర్ బావుంది అంటూనే.. ఈ టీజర్ ను ఆదిపురుష్ దర్శకుడికి చూపించండ్రా అంటూ ఘాటుగా కమెంట్స్ చేస్తున్నారు.



అంత పెద్ద హీరో, భారీ బడ్జెట్ ఉన్నా.. ఎన్నో విమర్శల పాలైన వాళ్లు.. ఈ చిన్న టీమ్ ను చూసి నేర్చుకోవాలి అంటూ మరోసారి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నారు. నిజమే.. ఇప్పుడు ఈ గ్రాఫిక్స్ తో పాటు విజువల్ ఎఫెక్ట్స్ కు ఎంత వాల్యూ ఉందో తెలియడానికి ఆదిపురుష్‌ తో పాటు ఈ హనుమాన్ టీజర్స్ చూస్తే చాలు.

Tags

Read MoreRead Less
Next Story