Keerthy Suresh: కీర్తికి ఏమైంది.. ఇలా తయారైంది: ఫ్యాన్స్ ఫైర్

Keerthy Suresh: కీర్తికి ఏమైంది.. ఇలా తయారైంది: ఫ్యాన్స్ ఫైర్
X
Keerthy Suresh: మహానటి చూసి మరో మంచి నటి ఇండస్ట్రీకి వచ్చిందని ఎంతో మురిసిపోయారు.. ఎంతందంగా ఉంది. ఎంత బాగా ఒదిగిపోయింది పాత్రలో.. కట్టుబొట్టు ఇలా ఉండాలని ఫ్యామిలీ ఆడియన్స్ తెగ సంబరపడిపోయారు..

Keerthy Suresh : మహానటి చూసి మరో మంచి నటి ఇండస్ట్రీకి వచ్చిందని ఎంతో మురిసిపోయారు.. ఎంతందంగా ఉంది. పాత్రలో ఎంత బాగా ఒదిగిపోయింది .. కట్టుబొట్టు ఇలా ఉండాలని ఫ్యామిలీ ఆడియన్స్ తెగ సంబరపడిపోయారు.. కానీ ఇంతలోనే ఏమైందో.. అంతలేదు.. ఉన్నది గ్లామర్ ఫీల్డ్‌లో.. అవకాశాలు వచ్చినప్పుడే సద్వినియోగం చేసుకోవాలి అన్నట్లుంది ప్రస్తుతం కీర్తి గ్లామరస్ ఫోటో షూట్‌లు చూస్తుంటే.

మడి కట్టుకుని కూర్చుంటే మనకి అవకాశాలు ఎవరిస్తారనుకుందో ఏమో ఒక్కసారిగా రూటు మార్చేసింది. అందుకే ఆమెపై నెటిజన్లు, కీర్తి అభిమానులు ఫైరవుతున్నారు. సర్కారు వారి పాట చిత్రంలోనే కీర్తి కొంత గ్లామర్‌గానే కనిపించింది. ఇటీవల తన ఇన్‌స్టాగ్రామ్‌ కొన్ని చిత్రాలను పోస్ట్ చేసింది. దీనిలో ఆమె గ్రీన్ కలర్‌లో ఉన్న ఓవర్ సైజ్ సూట్ ధరించి కనిపించింది.

ఆమె తన వెస్ట్రన్ లుక్‌కి మరింత అందాన్ని జోడించే ప్రయత్నంలో కొన్ని పూసల గొలుసులు కూడా ధరించింది. అయితే మోడ్రన్ లుక్‌లో కీర్తిని చూసిన నెటిజన్లు ఆమెని ఆ విధంగా చూడడాన్ని అస్సలు జీర్ణించుకోలేకపోతున్నారు. దారుణంగా ట్రోల్ చేస్తున్నారు.

కొంత మంది ఆమె లుక్‌ని మెచ్చుకుంటే, చాలా మంది మాత్రం వరస్ట్ ఫ్యాషన్ సెన్స్ ఆఫ్ ది డే అనే టైటిల్‌ని ఇచ్చి మరీ ట్రోల్ చేస్తున్నారు. మరో నెటిజన్ మీకు ఇలాంటి డ్రస్‌లు సూట్ కావు.. మీకు మన భారతీయ వస్త్రధారణ మాత్రమే సూట్ అవుతుంది.

అనవసరంగా ఇలాంటి దుస్తులు ధరించి అభాసుపాలు కాకండి అని సలహా ఇస్తున్నారు. మీకు ఇలాంటి మేకప్ కూడా సూటు కాదు అని ట్రోల్ చేస్తున్నారు. కీర్తి సినిమాల విషయానికి వస్తే ఆమె మామన్నన్, దసరా, భోళా శంకర్ చిత్రాల్లో నటిస్తోంది.

Tags

Next Story