Anushka Shetty: స్వీటీ ఎందుకిలా మారిపోయావ్.. : నెటిజన్స్ ట్రోల్స్

Anushka Shetty: స్వీటీ ఎందుకిలా మారిపోయావ్.. : నెటిజన్స్ ట్రోల్స్
X
Anushka Shetty: అందాల తార అనుష్క అసలే సినిమాల్లో కనిపించట్లేదని ఫ్యాన్స్ బాధపడుతుంటే, మహాశివరాత్రి సందర్భంగా ఆలయంలో కనిపించి అభిమానులను షాక్‌కి గురిచేసింది.

Anushka Shetty: అందాల తార అనుష్క అసలే సినిమాల్లో కనిపించట్లేదని ఫ్యాన్స్ బాధపడుతుంటే, మహాశివరాత్రి సందర్భంగా ఆలయంలో కనిపించి అభిమానులను షాక్‌కి గురిచేసింది. మీడియాకు, సినిమాలకు దూరంగా ఒకరకంగా అజ్ఞాతంలో గడుపుతోంది అనుష్క. శివరాత్రి రోజు సడెన్‌గా కనిపించే సరికి షాకయ్యారు.. ముద్దుగుమ్మ బొద్దుగా కనిపించడంతో నెటిజన్లు ట్రోల్స్ చేయడం మొదలు పెట్టారు. ఒక వినియోగ దారుడు.. అనుష్క చాలా లావుగా ఉంది. బరువు తగ్గితే మనకు తెలిసిన పాత అనుష్కలా కనిపిస్తుంది అని రాశారు.

మరొకరు ప్లీజ్ స్వీటీ స్లిమ్‌గా ఉండు. మిమ్మల్ని మరిన్ని సినిమాల్లో చూడాలనకుంటున్నాం. మరోవైపు, నెగటివ్ ట్రోల్స్‌ను టార్గెట్ చేస్తూ.. అనుష్క లుక్‌ను సమర్థించే అభిమానుల సైన్యం కూడా ఉంది. వారిలో ఒకరు, 'ఆమె ఇంకా ముద్దుగా ఉంది' అని రాస్తే, మరొకరు, 'అనుష్క యోగా శిక్షకురాలు, మీకు స్త్రీ శరీరం గురించి 1% కూడా జ్ఞానం లేనప్పుడు మాట్లాడకూడదు. ఆమెకు ఫిట్‌నెస్ మరియు ఆరోగ్యం గురించి నేర్పించవద్దు' అని రాశారు.

Tags

Next Story