Rashmika Mandanna: పాపం రష్మిక.. సానుభూతి దొరుకుతుందనుకుంటే మళ్లీ ట్రోల్స్..

Rashmika Mandana: నేషనల్ క్రష్ అంటూ టాలీవుడ్ లో పాగా వేసి.. బాలీవుడ్ లోనూ జెండా ఎగరేసేందుకు ప్లానింగ్స్ చేసుకున్న బ్యూటీ రష్మిక మందన్నా. ప్రస్తుతం తెలుగులో వారసుడు, పుష్ప2 చిత్రాలతో బిజీగా ఉన్న ఈ బ్యూటీ హిందీలోనూ దూకుడు చూపుతోంది.
అయితే లేటెస్ట్ గా రష్మిక తనను చాలామంది విమర్శిస్తున్నారని వాపోతూ సోషల్ మీడియాలో ఓ పెద్ద పోస్ట్ పెట్టింది. ఇది పెట్టిన నెక్ట్స్ రోజే అమ్మడిని మళ్లీ విమర్శిస్తున్నారు జనం. అందుకు కారణం ఎవరో తెలుసా.. కాంతార దర్శకుడు రూపొందించిన రెండో సినిమా హీరో. అన్నట్టు అమ్మడిని హీరోయిన్ గా పరిచయం చేసింది కూడా ఈ కాంతార దర్శకుడే.
రష్మిక మందన్నా ఇప్పుడు నేషనల్ స్టార్. కానీ తను పరిచయం అయింది ఒకప్పుడు రీమేక్ ల ఇండస్ట్రీ అనిపించుకున్న కన్నడ పరిశ్రమలో. తన తొలి సినిమా కిరాక్ పార్టీ. ఇది అక్కడ బిగ్గెస్ట్ హిట్. ఈ చిత్రానికి దర్శకుడు కాంతార హీరో రిషబ్ శెట్టి. అతనే రష్మికను ఆడిషన్ చేసి ఓకే చేశాడు.
ఈ సినిమాలో హీరోగా నటించిన రక్షిత్ శెట్టితోనే ప్రేమలో పడి ఎంగేజ్మెంట్ కూడా చేసుకుంది రష్మిక. తర్వాత అది క్యాన్సిల్ కూడా అయింది. అయితే తనను చాలామంది విమర్శిస్తున్నారని.. తను అందరికీ నచ్చాల్సిన అవసరం లేదనీ.. అయినా కొందరు అదే పనిగా హర్ట్ చేస్తున్నారంటూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టి వాపోయింది.
ఆ మరుసటి రోజే తన కెరీర్ అరంగేట్రం గురించి ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. కాలేజీలో మోడలింగ్ చేస్తున్నప్పుడు పేపర్ లో వచ్చిన తన ఫోటో చూసి ప్రొడక్షన్ హౌస్ నుంచి కాల్ వచ్చింది.. అక్కడికి వెళ్లి ఆడిషన్ చేశాక తనకు కిరాక్ పార్టీ సినిమాలో ఛాన్స్ వచ్చిందని చెప్పింది.
ఆ ప్రొడక్షన్ హౌస్ తన మాజీ లవర్ రక్షిత్ శెట్టిది. అతని గురించి కానీ, దర్శకుడు రిషబ్ శెట్టి గురించి కానీ ఒక్క ముక్క కూడా ఇంటర్వ్యూలో చెప్పలేదు. దీంతో మరోసారి నెటిజన్స్ చేతిలో ట్రోల్స్‌కు గురైంది రష్మిక.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com