'ఆదిపురుష్' పై ఆగని ట్రోల్స్..!

ఆదిపురుష్ పై ఆగని ట్రోల్స్..!
ఇప్పటికే నార్త్ ఇండియా మొత్తం బాయ్ కాట్ 'ఆదిపురుష్' అంటూ ట్వీట్స్ చేస్తున్నారు

ప్రభాస్ హీరోగా రామాయణ ఇతిహాసం ఆధారంగా 'ఆదిపురుష్' సినిమా తెరకెక్కింది. ట్రైలర్ విడుదల అయినప్పటి నుంచి 'ఆదిపురుష్' విమర్శలకు గురవుతోంది. సినిమా రిలీజ్ అయ్యాక కూడా విమర్శలు ఆగడం లేదు. ముఖ్యంగా వాల్మీక మహర్షి రచించిన ఆది కావ్యం రామాయణాన్ని తెరకెక్కించిన తీరు దారుణంగా ఉందంటున్నారు సినీ ప్రేమికులు. అసలు రామాయణం అంటే ఏంటో తెలియని వాళ్లు సినిమాగా తెరకెక్కించినట్లున్నారని ట్రోల్స్ చేస్తున్నారు. ట్రైలర్ విడుదలయ్యాక లెదర్ జాకెట్లను ఆంజనేయ, రామ లక్ష్మణులు వాడారని, తోలుతో తయారు చేసిన వాటిని రాముడెందుకు వాడుతాడని తీవ్రంగా విమర్శించారు. ఆపై... ట్రైలర్ యానిమేషన్ సినిమాను తలపించిందని అన్నారు.


రాముడిగా ప్రభాస్, సీతగా కృతిసనన్, లంకాధిపతిగా సైఫ్ అలీ ఖాన్ నటించారు. శివ భక్తుడైన రావణాసురుడిని, అతని లంకను ఓ పాతాలలోకంగా చూయించారని ట్రోల్స్ చేస్తున్నారు. రావణ లంక సుందరమైనదే కాకుండా బంగారంతో నిర్మించారని రామాయణం చెబుతుందని అంటున్నారు. ఇప్పటికే నార్త్ ఇండియా మొత్తం బైకాట్ 'ఆదిపురుష్' అంటూ ట్వీట్స్ చేస్తున్నారు.


ప్రభాస్ గెటప్ ను ఏకంగా గ్యాంగ్ స్టర్ అతిక్ అహ్మద్ కు ముడిపెట్టారు నెటిజన్లు. రావణుడు శివభక్తుడై ఉండి ఎప్పుడూ విభూతి ధారణ లేకుండా ఉండటాన్ని సినిమాలో చూపించారని అన్నారు. ఒక రకంగా మొఘల్ బాద్షాలాగా కనిపించాడని విమర్శకులు మండిపడుతున్నారు. సీతాదేవి, లక్ష్మణుల వస్తాధారణపై కూడా అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. భారతీయ ఇతిహాసాలను కించపరిచేలా సినిమా ఉందంటున్నారు.

హిందువుల మనోభావాలను సినీ దర్శకుడు ఓం రౌత్ దెబ్బతీశాడని అన్నారు. 'హిందూ సేన' అనే సంస్థ ఆదిపురుష్ పై కోర్టులో పిల్ దాఖలు చేసింది. సీతారాములను, ఆంజనేయ లక్షణులను చూపించిన తీరు సరిగ్గా లేదని అంటున్నారు. ఢిల్లీ హైకోర్టులో దాఖలు చేసిన పిల్ లో రాముడు, సీత, లక్ష్మణుడు, ఆంజనేయున్ని తెరకెక్కించిన తీరు బాలేదని అన్నారు. వారిని అనుచితంగా చూయించారని స్పష్టం చేశారు. సీతాదేవిని గ్లామరస్ గా చూపించడానికి దర్శకుడు ప్రయాసపడినట్లు తెలిపారు. ఇందుకుగాను.. అసభ్యకరమైన సన్నివేశాలను తొలగించేలా ఆదేశాలు ఇవ్వాలని కోర్టును కోరారు.

ఇదిలా ఉంటే... దర్శకుడు ఓం రౌత్ టెక్నికల్ గా బాగా డీల్ చేశారని అంటున్నారు మరికొంతమంది నెటిజన్లు. గ్రాఫిక్ వర్క్స్ బాగుందని... రామసేతు నిర్మాణసమయంలో రాముడు, సముద్రుడికి మధ్య నడిచే సీన్ మంచి అనుభూతిని ఇస్తుందంటున్నారు. సంజీవినీ పర్వతం తీసుకురావడం, ఇంద్రజిత్తు, కుంభకర్ణులతో పోరాడటం లాంటి గ్రాఫిక్స్ అద్భుతంగా ఉంటుందంటున్నారు. ఆదిపురుష్ సినిమాకు మ్యూజిక్ చాలా బాగుందన్నారు. వసూళ్లు బాగానే కొళ్లగొడుతున్నట్లుగా తెలుస్తోంది. ఇటు తెలుగురాష్ట్రాలలో కూడా విజయోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించింది చిత్ర యునిట్. అయినప్పటికీ ట్రోల్స్ లో మాత్రం ఏమాత్రం తగ్గడంలేదు.

Tags

Read MoreRead Less
Next Story