Ram Charan : రామ్ చరణ్ కోసం ఇండియాలోనే బిగ్గెస్ట్ కటౌట్

Ram Charan  :  రామ్ చరణ్ కోసం ఇండియాలోనే బిగ్గెస్ట్ కటౌట్
X

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ త్వరలోనే గేమ్ ఛేంజర్ గా రాబోతున్నాడు. శంకర్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ చరణ్ తండ్రి కొడుకులుగా డ్యూయొల్ రోల్ లో కనిపించబోతున్నాడు. సంక్రాంతి సందర్భంగా జనవరి 10న విడుదల కాబోతోన్న గేమ్ ఛేంజర్ ప్రమోషన్స్ ను కూడా భారీగా ప్లాన్ చేస్తున్నారు. జనవరి 4న ఏపిలో అత్యంత భారీ స్థాయిలో ఓ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించబోతున్నారు. ఈ ఈవెంట్ కు పవర్ స్టార్, డిప్యూటీ సిఎమ్ చీఫ్ గెస్ట్ గా వస్తున్నాడని ఆల్రెడీ వినిపిస్తోంది. అది ఆల్మోస్ట్ కన్ఫార్మ్ కూడా అంటున్నారు.

ఇక ఈ సినిమాకు సంబంధించి ఇంటర్వెల్ బ్యాంగ్ తో పాటు సెకండ్ హాఫ్ లో వచ్చే ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ గూస్ బంప్స్ తెప్పిస్తుందని ఫ్యాన్స్ ను ఊరిస్తున్నారు. ఆ ఫ్లాష్ బ్యాక్ లోనే చరణ్ అప్పన్న పాత్రలో కనిపిస్తాడు. అయితే ఈ గేమ్ ఛేంజర్ కు సంబంధించి కొందరు మెగా ఫ్యాన్స్ అంతా కలిసి ఓ సర్ ప్రైజ్ ను ప్లాన్ చేశారు. ఇండియాలోనే అత్యంత పెద్ద కటౌట్ ను లాంఛ్ చేయబోతున్నారు. ఈ కటౌట్ ఎన్ని అడుగులు ఉంటుంది అనేది చెప్పలేదు కానీ.. ఇండియాలోనే బిగ్గెస్ట్ అంటున్నారంటే అన్నీ కటౌట్ ల లెంగ్త్ తెలుసుకునే ఆ స్టేట్మెంట్ ఇస్తున్నారనుకోవచ్చు.

ఇక ఈ కటౌట్ ను గేమ్ ఛేంజర్ నిర్మాత దిల్ రాజు చేతుల మీదుగా ఈ 29న విజయవాడలోని వజ్ర గ్రౌండ్స్ లోని బృందావన కాలనీలో లాంఛ్ చేయబోతున్నారు. ప్రస్తుతం ఈ బిగ్ కటౌట్ మేటర్ టాక్ ఆఫ్ ద కంట్రీ అవుతోంది. మరి ఆ కటౌట్ ఎలా ఉంటుందో.. ఎంత పెద్దగా ఉంటుందో అని ఫ్యాన్స్ కూడా ఎదురుచూస్తున్నారు.

Tags

Next Story