Ritika Nayak : ఈ బ్యూటీ టాప్ హీరోయిన్ అవుతోందా

టాలీవుడ్ లోనే కాదు ఏ ఇండస్ట్రీలో అయినా ఎప్పుడూ హీరోయిన్ల కొరత అనే మాట వినిపిస్తుంది. మళయాలం మాత్రం ఇందుకు మినహాయింపు. అక్కడ హీరోయిన్ల కంటే పాత్రలకే ప్రాధాన్యం ఉంటుంది కాబట్టి. ఇక తెలుగులో ఈ కొరత రెగ్యులర్ గా వినిపించే మాట. ఉన్నవాళ్లలో స్టార్ హీరోయిన్లు ఒకరో ఇద్దరో అనిపించుకుంటారు. చాలామంది స్ట్రగుల్ అవుతూనే ఉంటారు. ఈ లోగా మరో హీరోయిన్ వచ్చేస్తుంది. అలా వస్తోన్న బ్యూటీస్ లో టాలీవుడ్ లో పాగా వేయగలదు అనిపించుకుంటోంది రితికా నాయక్.
విశ్వక్ సేన్ హీరోగా నటించిన అశోకవనంలో అర్జున కళ్యాణం అనే చిత్రంతో తెలుగు తెరకు పరిచయం అయిందీ బ్యూటీ. చూడగానే ఆకట్టుకున్నా.. ఆ తర్వాతెందుకో పెద్ద ఆఫర్స్ రాలేదు. కొన్నాళ్ల తర్వాత తేజ సజ్జా సరసన ప్యాన్ ఇండియా మూవీ ‘మిరాయ్’లో ఛాన్స్ అందుకుంది. తన పరిచయ వీడియో విపరీతంగా ఆకట్టుకుంది. అప్పుడూ షైన్ కాలేదు. సడెన్ గా బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్ట్స్ తో తాజాగా లైమ్ లైట్ లోకి వచ్చేసిందీ సోయగం. రీసెంట్ గా వరుణ్ తేజ్, మేర్లపాక గాంధీ కాంబోలో రూపొందే సినిమాలో తనే హీరోయిన్ గా ఫైనల్ అయింది. ప్రస్తుతం గోపీచంద్, సంకల్ప్ రెడ్డి కాంబోలో వస్తోన్న సినిమాలో తననే హీరోయిన్ గా తీసుకున్నారు. ఈ రెండు సినిమాలూ భిన్నమైన నేపథ్యాల్లో సాగేవి. గోపీచంద్ ది పీరియాడికల్ ఫిక్షనల్ కథ. వరుణ్ తేజ్ మూవీ హారర్ బ్యాక్ డ్రాప్ లో రూపొందే సినిమా. అటు మిరాయ్ లో తను అద్భుతమైన యాక్షన్ సీన్స్ కూడా చేసింది. సో.. ఈ మూడు సినిమాలూ ప్రామిసింగ్ గానే ఉన్నాయి. ఇవి కాక ఆనంద్ దేవరకొండ సరసన డ్యూయొట్ అనే మూవీ ఉంది. కాకపోతే ఈ ప్రాజెక్ట్ కు సంబంధించిన ప్రాపర్ అప్డేట్స్ రావడం లేదు. బట్ ఆ మూడూ హిట్ అయితే.. రాబోయే రోజుల్లో రితికా నాయక్ టాలీవుడ్ లో టాప్ లేపే చాన్స్ లేకపోలేదు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com