Ileana D'Cruz : కొడుకు కోవా ఫీనిక్స్ డోలన్ ఫొటో షేర్ చేసిన ఇలియానా

బర్ఫీ నటి ఇలియానా డి'క్రూజ్ ఆగస్టు 1న తన మొదటి బిడ్డ అయిన మగబిడ్డకు జన్మనిచ్చింది. ప్రస్తుతం మాతృత్వాన్ని ఆస్వాదిస్తోనన ఇలియానా... తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ ఇంట్రస్టింగ్ పోస్టు చేసింది. ఈ పోస్టులో ఆమె తన ముద్దుల కొడుకి ఫొటోను షేర్ చేసింది. అతని పేరు- కోవా ఫీనిక్స్ డోలన్‌గా వెల్లడించింది. కోవాకు జన్మనిచ్చిన తర్వాత తన చేతిని పట్టుకున్నటువంటి ఫొటోను షేర్ చేసిన ఇలియానా.. ఇప్పుడు, మళ్లీ 3 వారాల వయస్సులో ఉన్న బేబీ కోవా మరొక అందమైన ఫొటోను పంచుకుంది.
ఇలియానా డి'క్రూజ్ తన ఇన్‌స్టాగ్రామ్ కథనాల్లో షేర్ చేసిన బేబీ కోవా చిత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఇందులో కోవా పూర్తి చిత్రాన్ని పోస్ట్ చేయనప్పటికీ, ఆమె అతని చిన్న పాదం ఫొటోను పంచుకుంది. అతను ఒక దుప్పటిలో కప్పబడి, కేవలం పాదం మాత్రమే బయటికి కనిపించేలా ఉన్నాడు. దీనికి ఇలియానా డి'క్రూజ్ రెడ్ హార్ట్ ఎమోజితో పాటు "పీకాబూ" అని రాశారు.
ఆగస్టు 5న, ఇలియానా డి క్రజ్ తన నవజాత కొడుకు కోవా చిత్రాన్ని పోస్ట్ చేసి, అతన్ని ప్రపంచానికి పరిచయం చేసింది. అందమైన మోనోక్రోమటిక్ పిక్చర్‌లోని టెక్స్ట్ ను గమనించగా.. "ఆగస్టు 1, 2023న జన్మించిన కోవా ఫీనిక్స్ డోలన్‌ని పరిచయం చేస్తున్నాము" అని రాసి ఉంది. ఈ స్నాప్‌ను పంచుకుంటూ, ఇలియానా తన క్యాప్షన్‌లో ఇలా రాసుకువచ్చింది. “మా డార్లింగ్ బాయ్‌ని హృదయాలను దాటి ప్రపంచానికి స్వాగతం పలకడం ఎంత సంతోషంగా ఉందో పదాల్లో చెప్పలేం” అంటూ ఆమె పోస్ట్ చేసింది. ఈ పోస్టుపై మలైకా అరోరా, అర్జున్ కపూర్, సమంతా రూత్ ప్రభు, అతియా శెట్టి, నర్గీస్ ఫక్రీ, హుమా ఖురేషి, ఇతర ప్రముఖులు తమ ప్రేమను కురిపించారు, కొత్త తల్లికి అభినందనలు తెలిపారు.
ఇలియానా తరచుగా తన ఇన్‌స్టాగ్రామ్ కథనాలలో తన భాగస్వామి చిత్రాలను పంచుకుంటూ వస్తోంది. అయితే, ఆమె ఇంకా అతని పేరును వెల్లడించలేదు. DNAలోని ఒక నివేదిక ఇలియానా మిస్టరీ మ్యాన్ మైఖేల్ డోలన్ వివరాలను వెల్లడించింది. వారిద్దరూ ఇప్పటికే వివాహం చేసుకున్నట్లు పేర్కొంది. DNA ద్వారా యాక్సెస్ చేయబడిన వివాహ రిజిస్ట్రీ వివరాల ప్రకారం, వారు ఈ సంవత్సరం మే 13 న ఒక్కటయ్యారు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com