"మిస్టేక్" మూవీ నుంచి 'గ్రహచారం గంటా' లిరికల్ సాంగ్ రిలీజ్..!

మిస్టేక్ మూవీ నుంచి గ్రహచారం గంటా లిరికల్ సాంగ్ రిలీజ్..!
అభినవ్ సర్ధార్, అజయ్ కతుర్వార్, తాన్యా, కరిష్మా కుమార్, సుజిత్ కుమార్, తేజ అయినంపూడి మరియు జ్ఞాన ప్రియ నటీ నటులు గా నటిస్తున్న సినిమా "మిస్టేక్".

అభినవ్ సర్ధార్, అజయ్ కతుర్వార్, తాన్యా, కరిష్మా కుమార్, సుజిత్ కుమార్, తేజ అయినంపూడి మరియు జ్ఞాన ప్రియ నటీ నటులు గా నటిస్తున్న సినిమా "మిస్టేక్". ఏఎస్పి మీడియా పతాకంపై అభినవ్ సర్ధార్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సన్నీ కోమలపాటి దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా "మిస్టేక్" సినిమా నుంచి 'గ్రహచారం గంటా' మారెరా లిరికల్ సాంగ్ ను రిలీజ్ చేశారు. మణి జెన్న మ్యూజిక్ కంపోజిషన్ లో మంగ్లీ, రోల్ రైడా ఈ పాటను పాడారు.

అరి యరియా దేవ గ్రహచారం గంటా మారెరా, సరి సరియా మావ గాచారం గత్తర లేపెనురా...అరి యరియా దేవ తొందరలో సిందులు ఎయ్యకురా..సరి సరియా మావ సిలకల్లె సిక్కుల పడతవురా..అంటూ సాగుతుందీ పాట. మాస్ బీట్, ర్యాప్ కలిసిన కొత్త స్టైల్ లో రూపొందిన గ్రహచారం ఘంటా మారెరా పాట వినగానే ఆకట్టుకుంటోంది. ఈ పాటను శ్రీ సిరాగ్ తో కలిసి రోల్ రైడా రాశారు. ఇటీవల విడుదల చేసిన "మిస్టేక్" మూవీ మోషన్ పోస్టర్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది. ప్రస్తుతం చిత్రీకరణ పూర్తి చేసుకున్న "మిస్టేక్" మూవీ త్వరలో థియేటర్ లలో విడుదలకు సిద్ధమవుతోంది.

సమీర్, రాజా రవీంద్ర ఇతర పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం - మణి జెన్న, సినిమాటోగ్రఫీ - హరి జాస్తి, మాటలు - శ్రీహరి మండ, ఆర్ట్ - రవికుమార్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ - నిధి, నిర్మాత - అభినవ్ సర్ధార్, రచన దర్శకత్వం - సన్నీ కోమలపాటి

Tags

Read MoreRead Less
Next Story