Bigg Boss 5 Telugu: ఎవరీ ప్రీతి అన్షు..? బిగ్ బాస్‌లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ నిజమేనా..?

Preethi Anshu (tv5news.in)
Bigg Boss 5 Telugu: ప్రతీ సీజన్ బిగ్ బాస్‌లో ముందుగా కొంతమంది హౌస్‌మేట్స్‌ను ప్రేక్షకులకు పరిచయం చేస్తారు. ఆ తర్వాత బిగ్ బాస్ హౌస్‌లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీగా ఇద్దరు లేదా ముగ్గురు సెలబ్రిటీలను పంపుతారు. ఏ భాషలో అయినా జరిగే ప్రాసెస్ ఇదే. కానీ ఈసారి వైల్డ్ కార్డ్ ఉండదేమో అన్న అనుమానాలు ప్రేక్షకుల్లో మొదలయ్యాయి. ఎందుకంటే బిగ్ బాస్ స్టార్ట్ అయిన మొదటిరోజే 19 మంది కంటెస్టెంట్లు హౌస్‌లోకి వెళ్లిపోయారు. అంతమంది వెళ్లిన తర్వాత వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఉండదు అనుకున్నారంతా.
కానీ వైల్డ్ కార్డ్ ఉండనుందని.. దానికి ఒక బుల్లితెర యాంకర్ సెలక్ట్ అయ్యిందని వార్తలు వచ్చాయి. మెల్లగా అవి రూమర్స్ అని తేలిపోయింది. కొన్నాళ్లు వైల్డ్ కార్డ్ ఎంట్రీ సంగతే అందరూ మర్చిపోయారు. తాజాగా మరోసారి ఈ విషయంపై సోషల్ మీడియాలో రకరకాల రూమర్స్ వినిపిస్తున్నాయి. వైజాగ్‌కు చెందిన ఒక మోడల్ బిగ్ బాస్ హౌస్‌లోకి వైల్డ్ కార్డ్‌లోకి ఎంట్రీ ఇవ్వనుందని వార్తలు మొదలయ్యాయి.
ఈవారం ఒకేసారి లోబోను సీక్రెట్ రూమ్‌కు పంపడం, శ్వేతాను ఎలిమినేట్ చేయడం చూసిన తర్వాత కచ్చితంగా వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఉంటుందని ఫిక్స్ అయ్యారంతా. కానీ ఈవారం అలా జరగలేదు. బిగ్ బాస్ హోస్ట్ నాగార్జున కనీసం వైల్డ్ కార్డ్ ఎంట్రీ గురించి ఊసే ఎత్తలేదు. అప్పటికే వైల్డ్ కార్డ్ ఎంట్రీగా వస్తుందన్న అమ్మాయి ఎవరూ అన్న ప్రశ్న సోషల్ మీడియా అంతా వ్యాపించింది. తన గురించి సెర్చ్ చేయడం మొదలుపెట్టారు నెటిజన్లు.
ప్రీతి అన్షు.. వైజాగ్‌కు చెందిన మోడల్. తన తండ్రి అక్కడే ఒక నేవీ ఆఫీసర్. ఈ అమ్మాయి బిగ్ బాస్ హౌస్‌లోకి వైల్డ్ కార్డ్‌గా ఎంట్రీ ఇవ్వనుందని గతకొంతకాలంగా తన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. హమీదా ఎలిమినేట్ అవ్వడంతో షోలో ఇంక లవ్ ట్రాక్‌ను నడిపించే అవకాశం లేదు. అందుకే సన్నీతో లవ్ ట్రాక్ నడిపించడానికి ప్రీతిని సీన్‌లోకి దింపనున్నారని కూడా రూమర్స్ వచ్చాయి. కానీ తాజాగా అదంతా అబద్ధం అని తేలింది.
తనకు సోషల్ మీడియాలో పాపులారిటీ పెంచుకోవడానికి, ఇన్‌స్ట్రాగ్రామ్‌లో ఫాలోవర్స్‌ను పెంచుకోవడానికి ప్రీతి అన్షు కావాలని ఈ వార్తను సృష్టించిందట. తాను క్వారంటీన్‌లో ఉన్నానని, త్వరలోనే బిగ్ బాస్ హౌస్‌లోకి వెళ్లనున్నానని తన సన్నిహితులతో చెప్పిందట. దీంతో అది కాస్త పెద్ద వార్తగా మారింది. కానీ అప్పటికే ప్రీతి అన్షుకు కావాల్సినంత ఫాలోయింగ్ వచ్చేసింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com