Priyanka Chopra: సరోగసీ ద్వారా అమ్మనయ్యా.. మా ఇంటికి ఓ క్యూట్ బంగారం..: ప్రియాంక చోప్రా

Priyanka Chopra: బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా అమ్మనయ్యానని ఆనందంతో చెబుతోంది. 2018 డిసెంబర్‌లో పెళ్లి చేసుకున్న ప్రియాంక, నిక్ జోనాస్ అమ్మానాన్నలయిన ఆనందాన్ని సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. ఇద్దరూ సరోగసీ ద్వారా తమ మొదటి బిడ్డను స్వాగతించారు. జనవరి 21వ తేదీ రాత్రి ఈ జంట సోషల్ మీడియా ద్వారా అభిమానులకు తెలియజేశారు. ఇంతకీ పాపా, బాబా అని ఆసక్తి కనబరుస్తున్న నెటిజన్లకు.. నిక్ మరియు ప్రియాంకలకు ఆడపిల్ల పుట్టిందని బాలీవుడ్ మీడియా తెలియజేస్తోంది.
సరోగసీ ద్వారా అమ్మనయ్యా.. మా ఇంటికి ఓ క్యూట్ బంగారం..: ప్రియాంక చోప్రాఈ సంతోషకరమైన సందర్భాన్ని ఎంజాయ్ చేసేందుకు తమకు ప్రైవసీ కావాలని అడిగారు. ఇన్‌స్టా వేదికగా ప్రియాంక చోప్రా.. "మేము సర్రోగసీ ద్వారా బిడ్డను స్వాగతించినందుకు చాలా సంతోషిస్తున్నాము. ఈ ప్రత్యేక సమయంలో మేము మా కుటుంబంపై దృష్టి కేంద్రీకరించినందున ఎవరూ మమ్మల్ని ఇబ్బంది పెట్టవద్దని గౌరవంగా అడుగుతున్నాము. ధన్యవాదాలు అని పేర్కొంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com