Nidhhi Agerwal: అందాల నిధి అగర్వాల్.. మత్తెక్కించే ఫోటోలతో అందరూ ఫ్లాట్..
Nidhhi Agerwal: ఏ హీరోయిన్ వల్ల సినిమాకు ఎంత కలర్ వస్తుందో ముందే చెప్పలేం.

Nidhhi Agerwal (tv5news.in)
Nidhhi Agerwal: ఏ హీరోయిన్ వల్ల సినిమాకు ఎంత కలర్ వస్తుందో ముందే చెప్పలేం. లవ్ స్టోరీలతో పరిచమయ్యి గ్లామర్ డోస్ పెంచేసిన హీరోయిన్లు కూడా ఉన్నారు. అందులో ఒకరు నిధి అగర్వాల్. అక్కినేని హీరోలతో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసిన రికార్డ్ నిధి సొంతం.
నాగచైతర్య హీరోగా తెరకెక్కిన 'సవ్యసాచి'తో తెలుగు ప్రేక్షకులకు హీరోయిన్‌గా పరిచమయ్యింది నిధి. అందులో ఈకాలం అమ్మాయిలాగా చాలా మోడర్న్‌గా కనిపించి ఆకట్టుకుంది.
నాగచైతన్య తర్వాత వెంటనే అక్కినేని అఖిల్ సినిమాలో ఛాన్స్ కొట్టేసింది ఈ భామ. అఖిల్ హీరోగా వచ్చిన 'మిస్టర్ మజ్ను'లో తనదైన యాక్టింగ్‌తో ఆకట్టుకుంది నిధి. సవ్యసాచి లాగా కాకుండా మిస్టర్ మజ్ను పూర్తిస్థాయి ప్రేమకథగా తెరకెక్కింది.
నిధి కెరీర్‌లో ఫస్ట్ బ్లాక్‌బస్టర్‌ను తెచ్చిపెట్టిన చిత్రం 'ఇస్మార్ట్ శంకర్'. ఇందులో రామ్ సరసన యాక్టింగ్‌తో పాటు గ్లామర్, రొమాన్స్‌ను కూడా బ్యాలెన్స్ చేసి నిధి అందరినీ ఇంప్రెస్ చేసింది.
ప్రస్తుతం నిధి.. పవన్ కళ్యాణ్ సరసన 'హరిహర వీరమల్లు'లో నటిస్తోంది. క్రిష్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఒక పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కుతోంది. ఇందులో నిధి ఫస్ట్ లుక్ కూడా ఇప్పటికే విడుదలయ్యింది.
హరిహర వీరమల్లు గురించి నిధి మరిన్ని విశేషాలను తన ఫ్యాన్స్‌తో పంచుకుంది. ఇందులో తాను పంచమి అనే పాత్రలో కనిపించనున్నట్టు చెప్పింది.
రాణి పాత్ర చేయడం మొదటిసారి కాబట్టి దానికోసం తన కాస్ట్యూమ్స్‌ను మ్యానేజ్ చేయడం కష్టం అంటోంది నిధి అగర్వాల్.
తెలుగుతో పాటు హిందీలో కూడా పలు సినిమాలతో బిజీగా గడిపేస్తోంది నిధి.
RELATED STORIES
Gold and Silver Rates Today : భారీగా తగ్గిన బంగారం, స్వల్పంగా తగ్గిన...
29 Jun 2022 6:49 AM GMTMukesh Ambani: రిలయన్స్ విషయంలో ముకేశ్ అంబానీ సంచలన నిర్ణయం.....
28 Jun 2022 3:00 PM GMTPallonji Mistry: వ్యాపార దిగ్గజం షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ చైర్మన్...
28 Jun 2022 7:07 AM GMTGold and Silver Rates Today : నిన్నటి మాదిరిగానే బంగారం ధర, తగ్గిన...
28 Jun 2022 5:38 AM GMTOnePlus Nord 2T : వన్‌ప్లస్ సిరీస్‌లో మరో కొత్త మొబైల్.. ధర, ఫీచర్లు..
27 Jun 2022 12:00 PM GMTSAIL Krishnamurthy: పబ్లిక్ రంగ పితామహుడు, సెయిల్ మాజీ ఛైర్మన్...
27 Jun 2022 9:45 AM GMT