Nidhhi Agerwal: 'హీరో' కోసం నిధి షాకింగ్ రెమ్యునరేషన్.. లక్షల నుండి కోట్లలోకి..

Nidhhi Agerwal: ఇటీవల మహేశ్ ఫ్యామిలీ నుండి ఒకరు హీరోగా పరిచయమయ్యారు. అతడే అశోక్ గల్లా. సంక్రాంతి రేస్ నుండి పాన్ ఇండియా సినిమాలన్నీ తప్పుకున్న తర్వాత అశోక్ గల్లా మొదటి సినిమా 'హీరో' ప్రేక్షకుల ముందుకు వచ్చింది. యంగ్ డైరెక్టర్ శ్రీరామ్ ఆదిత్య.. ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఇందులో హీరోయిన్‌గా నిధి అగర్వాల్ అలరించింది. అయితే హీరో కోసం నిధి తీసుకున్న రెమ్యునరేషన్ విషయం ప్రస్తుతం టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.
నాగచైతన్య హీరోగా తెరకెక్కిన 'సవ్యసాచి'తో తెలుగులోకి హీరోయిన్‌గా అడుగుపెట్టింది నిధి అగర్వాల్. ఆ తర్వాత చైతూ తమ్ముడు అఖిల్‌తో 'మిస్టర్ మజ్ను' అనే సినిమా చేసింది. అక్కినేని హీరోలతో చేసిన రెండు సినిమాలు తనకు కమర్షియల్‌గా హిట్‌ను అందించలేకపోయాయి. ఆ తర్వాత చేసిన 'ఇస్మార్ట్ శంకర్'తో కమర్షియల్ సక్సెస్‌ను అందుకుంది నిధి. అప్పటినుండి గ్లామర్ డోస్‌ను కూడా పెంచేసింది.
మహేశ్ బాబు ఫ్యామిలీ నుండి పరిచయమవుతున్నా కూడా అశోక్ గల్లా గురించి తెలుగు ప్రేక్షకులకు తెలీదు. అలాంటి సమయంలో హీరో సినిమాకు పెద్ద ప్లస్‌గా నిలిచింది నిధి. అంతకు ముందు సినిమాలకు కేవలం రూ.50 నుండి 80 లక్షలు పారితోషికం అందుకున్న నిధి.. హీరో కోసం ఏకంగా కోటిన్నర డిమాండ్ చేసిందట. దర్శక నిర్మాతలు కూడా నిధి డిమాండ్‌కు తగినట్టు రెమ్యునరేషన్ అందించినట్టు సమాచారం.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com