Nidhhi Agerwal: స్లోగా సినిమాలు చేస్తున్న హాట్ బ్యూటీ.. అదే కారణమంటూ కామెంట్..

Nidhhi Agerwal (tv5news.in)
Nidhhi Agerwal: ఇప్పటికే ఎంతోమంది బాలీవుడ్ భామలు బీ టౌన్ నుండి టాలీవుడ్‌కు వచ్చి ఇక్కడ సక్సెస్‌ను చవిచూశారు. అందులో చాలావరకు హీరోయిన్లకు బాలీవుడ్‌కంటే టాలీవుడే ఎక్కువ క్రేజ్ తెచ్చిపెట్టింది. అలాంటి హీరోయిన్లలో ఒకరు నిధి అగర్వాల్. ముందుగా బాలీవుడ్‌లో అడుగుపెట్టి ఆ తర్వాత తెలుగులో స్టార్‌డమ్ సంపాదించుకున్న ఈ భామ తాజాగా సినిమాల విషయంలో స్పీడ్ తగ్గించింది. దానికి కారణమేంటో ఇటీవల బయటపెట్టింది నిధి.
'సవ్యసాచి' సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన నిధి అగర్వాల్.. అక్కినేని హీరోలతోనే బ్యాక్ టు బ్యాక్ సినిమాలను చేసింది. కానీ ఆ రెండు చిత్రాలు తనకు హిట్‌ను మాత్రం ఇవ్వలేకపోయాయి. చివరిగా పూరి జగన్నాధ్ దర్శకత్వంలో తెరకెక్కిన 'ఇస్మార్ట్ శంకర్' సినిమాతో హిట్ ట్రాక్ ఎక్కింది నిధి. ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న 'హరిహర వీరమల్లు'లో హీరోయిన్‌గా నటిస్తోంది.
సినిమాలు చేయడంలో స్పీడ్ తగ్గిందేంటి అనే ప్రశ్నగా నిధి స్పందించింది. వరుసగా అవకాశాలు వస్తు్న్నా తానే ఒప్పుకోవడం లేదని బయటపెట్టింది నిధి. వచ్చిన ప్రతీ సినిమాను ఒప్పేసుకుంటే క్రేజ్ ఎంత త్వరగా వచ్చిందో.. అంతే త్వరగా పోతుందని తన అభిప్రాయాన్ని చెప్పింది. నిధానంగా సినిమాలు చేసుకుంటే వెళ్తేనే ఇండస్ట్రీలో ఎక్కువ కాలం ఉండొచ్చని కామెంట్ చేసింది. సక్సెస్ కావాలంటే మంచి పాత్రల కోసం ఎదురుచూడక తప్పదని స్పష్టం చేసింది నిధి అగర్వాల్.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com