Niharika : మా బాబాయ్ రావడం లేటవచ్చు కానీ... బాక్సాఫీస్ బద్దలు కొట్టడం పక్కా : నిహారిక

Niharika : పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్, దగ్గుబాటి రానా కలిసి నటిస్తోన్న లేటెస్ట్ మూవీ 'భీమ్లానాయక్' .. సంక్రాంతికి విడుదల కావాల్సిన ఈ సినిమా ఫిబ్రవరి 25కు వాయిదా పడిన సంగతి తెలిసిందే... 'ఆర్‌ఆర్‌ఆర్' రిలీజ్‌ని దృష్టిలో ఉంచుకొని ఈ సినిమాని వాయిదా వేస్తున్నట్లుగా చిత్రబృందం ఇటీవల ప్రకటించింది.. అయితే విడుదల తేది మార్చడం పైన తాజాగా నటి నిహారిక స్పందించింది.
'భీమ్లానాయక్' సూపర్ హిట్ అవుతుందని అన్నారు. ''మా బాబాయ్ ఓ సినిమాలో చెప్పినట్టు.. ''రావడం కాస్త లేటు అవ్వొచ్చు. కానీ రావడం మాత్రం పక్కా'' అలాగే రిలీజ్ డేట్ కాస్త కాస్త ఆలస్యం కావొచ్చు.. కానీ.. బాక్సాఫీస్ బద్దలు కొట్టడం పక్కా'' అని చెప్పుకొచ్చింది. అటు 'ఆర్‌ఆర్‌ఆర్' పైన మాట్లాడుతూ.. ఇటీవల ఓ థియేటర్‌లో సినిమా ట్రైలర్ చూస్తుంటే తనకి ఒళ్లు గగుర్పొడిచిందని, చరణ్ తనకి అన్నగా ఈ మాట చెప్పడం లేదని, ఒక ప్రేక్షకురాలిగా చెబుతునన్నట్టుగా వెల్లడించింది.
ఇక ఎన్టీఆర్ అన్న తనకి ఎన్నో సంవత్సరాల నుంచి తెలుసనని,ఆయన సతీమణి ప్రణతి తనకి క్లాస్‌మేట్ అని వెల్లడించింది.. ఎన్టీఆర్ ఎనర్జీ మరోస్థాయిలో ఉంటుందని సినిమా కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నట్లుగా చెప్పింది. కాగా 'ఆర్‌ఆర్‌ఆర్' జనవరి 7న ప్రేక్షకుల ముందుకు రానుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com