Niharika : ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ డిలీట్ చేసిన మెగా డాటర్.. ఆ వీడియోనే కారణమా?

Niharika : ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ డిలీట్ చేసిన మెగా డాటర్..  ఆ వీడియోనే కారణమా?
Niharika : మెగా డాటర్ నిహారిక సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. ముఖ్యంగా నిహారికకు ఇన్‌స్టాగ్రామ్‌లో చాలా మంది ఫాలోవర్లు ఉన్నారు.

Niharika : మెగా డాటర్ నిహారిక సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. ముఖ్యంగా నిహారికకు ఇన్‌స్టాగ్రామ్‌లో చాలా మంది ఫాలోవర్లు ఉన్నారు. ఆమె ఏ పోస్ట్ చేసిన సరే అది వైరల్ అవుతోంది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫోటోలు షేర్ చేస్తుంటుంది.

ఇక అందులో కొత్త సినిమాలపై కూడా అప్పుడప్పుడు తనదైన శైలిలో స్పందిస్తూ ఉంటుంది. అయితే హఠాత్తుగా ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను డిలీట్ చేసింది. నిహారిక సడన్ గా ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకుంది అన్నది హాట్ టాపిక్ గా మారింది.

ఇటీవల ఆమె పోస్ట్ చేసిన ఓ వీడియోపై నెగిటివ్ కామెంట్స్ రావడంతో ఆమె ఈ నిర్ణయం తీసుకుందని కొందరు భావిస్తున్నారు.. అయితే ఇదే కారణమా మరేమైనా ఉందా అన్నది తెలియాల్సి ఉంది. ఇక యాంకర్‌గా కెరీర్‌ మొదలు పెట్టి ఒక మనసు సినిమాతో హీరోయిన్‌గా మారిపోయింది నిహారిక.

ఆ తర్వాత వెబ్‌సిరీస్‌లు, సినిమాల్లో నటించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంది. 2020, డిసెంబర్‌9న చైతన్య జొన్నలగడ్డని వివాహం చేసుకుంది.

Tags

Read MoreRead Less
Next Story