Sangeeth Shoban : మ్యాడ్ కుర్రాడితో నిహారిక కొత్త సినిమా

వెబ్ సిరీస్ లతో ఫేమ్ అయి వెండితెర వరకూ వచ్చాడు సంతోష్ శోభన్. మ్యాడ్, మ్యాడ్ స్క్వేర్ మూవీస్ తో తిరుగులేని క్రేజ్ సంపాదించుకున్నాడు. రాజేంద్ర ప్రసాద్ రేంజ్ టైమింగ్ ఉన్నవాడిగా పేరొచ్చింది. అలాంటి సంతోష్ హీరోగా నిహారిక కొణిదల ఓ సినిమా నిర్మించబోతోంది. ఆల్రెడీ 2024లో నిహారిక నిర్మించిన కమిటీ కుర్రోళ్లు చిత్రానికి కమర్షయల్ గా, విమర్శియల్ గా మంచి పేరొచ్చింది. ఫీల్ గుడ్ యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా కమిటీ కుర్రోళ్లు అందరి మనసుల్లోనూ బలమైన ముద్ర వేసింది. నటించిన వాళ్లంతా కొత్తవాళ్లే అయినా కంటెంట్ ను నమ్మి అడుగువేసిన నిహారిక అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది.
నిహారిక బ్యానర్ పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్ లో రాబోతోన్న ఈ రెండో సినిమాతో సంతోష్ శోభన్ సోలో హీరోగా నటించబోతున్నాడు. ఈ చిత్రాన్ని మానస శర్మ డైరెక్ట్ చేయబోతోంది. మానస గతంలో జీ5, పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మించిన ‘ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ’కి రైటర్ గా పని చేసింది. ఈ సిరీస్ లో సంతోష్ శోభన్ మెయిన్ లీడ్ గా నటించాడు. అలాగే మానస సోనీ లివ్ రూపొందించిన ‘బెంచ్ లైఫ్’తో దర్శకురాలుగా మారింది. ఇక నిహారిక నిర్మించే సినిమాతో ఫీచర్ ఫిల్మ్ డైరెక్టర్ ఎంట్రీ ఇవ్వబోతోంది. మొత్తంగా కమిటీ కుర్రోళ్లు వంటి మూవీతో చాలా పెద్ద హిట్ అందుకున్న నిహారిక కొణిదల రెండో సినిమా కావడం, పాటు మ్యాడ్ మూవీస్ తో అదరగొట్టిన సంతోష్ హీరోగా నటిస్తుండటంతో ఈ మూవీపై అప్పుడే అందరిలోనూ ఓ ఆసక్తి ఏర్పడింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com