నిహారిక వెడ్డింగ్.. ఇద్దరు హీరోయిన్లకి ఆహ్వానం
మెగా ఫ్యామిలీలో పెళ్లి సందడి మొదలైంది.. నాగబాబు ముద్దుల తనయ నిహారిక పెళ్లిపీటలెక్కే సమయం ఆసన్నమైంది. డిసెంబర్ 9న బుధవారం రాత్రి 7.15 ని.లకు రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ ప్యాలెస్‌లో ఈ వివాహ వేడుక జరగనుంది. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ దగ్గరి బంధువులను, సన్నిహిత మిత్రులకు మాత్రమే ఆహ్వాన పత్రికలు అందించారు. కాగా నిహారిక పెళ్లికి టాలీవుడ్ లో ఇద్దరు హీరోయిన్లకి ఆహ్వానం వచ్చిందట. ఇంతకీ ఆ ముద్దుగుమ్మలెవరనుకుంటున్నారా..! సొట్ట బుగ్గల సింగారి లావణ్యత్రిపాఠి, రీతూవర్మ. లావణ్య, నిహారిక జిమ్ మేట్స్. ఇక నిహారిక, రీతూవర్మ సినిమాల్లోకి రాకముందు నుంచే ఫ్రెండ్స్. దీంతో వారిద్దరికీ నిహారిక వెడ్డింగ్ ఇన్విటేషన్ ను అందించిందట. ఈ వెడ్డింగ్‌కి ఆహ్వానం అందిన రీతూ, లావణ్య విమానంలో వెళ్తున్న ఫొటో నెట్టింట్లో వైరల్‌గా మారింది.
ఇప్పటికే నిహారిక తన కుటుంబంతో ఉదయపూర్‌కు స్పెషల్ ఫ్లైట్‌లో వెళ్లారు. ఇక మెగా ఫ్యామిలీ అంతా అక్కడ ప్రీ వెడ్డింగ్ సెలెబ్రేషన్స్‌లో ఎంజాయ్ చేస్తున్నారు. సంగీత్ కార్యక్రమంలో మెగా కుటుంబ సభ్యులు ఊత్సాహంగా పాల్గొన్నారు. వివాహ బంధంతో ఒక్కటికానున్న నిహారిక చైతన్య జంట చిరు పాటకు చిందులేశారు. చిరు నటించిన మూవీ 'బావగారూ.. బాగున్నారా!' లోని 'ఆంటీ కూతురా అమ్మో అప్సరా' పాటకు ఈ జంట వేసిన స్టెప్పులు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com