Nikhil in Big Boss : బిగ్ బాస్ లో శివాజీ కావాలని ప్రయత్నిస్తోన్న నిఖిల్
తెలుగు బిగ్ బాస్ సీజన్ 8 ఊహించినంత రసవత్తరంగా ఏం జరగడం లేదు. కంటెస్టెంట్స్ మైనస్ గా మారారు అనేది చాలామంది చెబుతోన్న మాట. నిజానికి ఈ రియాలిటీ షోలో ఉండాల్సినంత స్టఫ్ తెలుగులో చాలా తక్కువ సీజన్స్ లోనే కనిపించింది. ఈ సారి మరింత డల్ గా మారింది. పైగా కెప్టెన్ లేకపోవడం.. బిగ్ బాసే గ్రూప్స్ గా విభజించి క్లాన్స్ ను క్రియేట్ చేసి కంటెస్టెంట్స్ తో ఆడిస్తున్న తీరు కూడా ఆకట్టుకోవడం లేదు. ఇవన్నీ ఓ ఎత్తైతే.. హౌస్ లో అందరికంటే తనే బెటర్ అనే ఫీలింగ్ లో బలంగా కనిపిస్తున్నాడు నిఖిల్. ఇతగాడు లాస్ట్ సీజన్ లో సీనియర్ యాక్టర్ శివాజీ ఎలాగైతే హౌస్ కు పెద్దన్నగా ఉన్నాడో తనూ అలాగే ఊహించుకుంటున్నట్టు కనిపిస్తోంది. ప్రతి కంటెస్టెంట్ వద్దకు వెళ్లి తనదైన శైలిలో పెద్దరికం చూపే ప్రయత్నం చేస్తున్నాడు. బట్ మిగతా సభ్యులు అతన్ని పెద్దగా పట్టించుకోవడం లేదు. దీనికి తోడు సోనియాతో పులిహోర కలపడం ఆవిడ కూడా ఇతగాడి వైపు అదో మాదిరిగా చూడ్డం.. ఇవన్నీ గేమ్ లో భాగంగా అనుకున్నా.. ఈ క్రమంలో నిఖిల్ చేస్తోన్న ఓవరాక్షన్ మాత్రం అతనేదో తనే ఈ హౌస్ కు పెద్దన్న అని ఫీలవుతున్నట్టుగా కనిపిస్తోంది.
ఇక నిఖిల్ చేస్తోన్న మరో విషయం ఏంటంటే.. గేమ్ లో ఎవరైనా ఓడిపోయినా.. గెలిచినా.. వారి వద్దకు( పిలవకపోయినా) వెళ్లి ఓదారుస్తున్నట్టుగా చెప్పడం.. గెలిచిన వారికైతే ఆ ప్లానింగ్ విషయంలో మరిన్ని సలహాలు ఇస్తున్నట్టుగా బిల్డప్ ఇవ్వడం లాంటివి చేస్తున్నాడు. ఈ విషయంలోనే యశ్మి గౌడ వద్దకు వెళ్లి ఏదేదో చెప్పాలని ప్రయత్నించాడు. బట్ యశ్మి అతన్ని తీవ్రంగా ఖండించింది. ప్రతిసారీ నీ ఒపీనియన్ ను మేం ఒప్పుకునేలా చేస్తున్నావు.. ఇంకెంత కాలం ఇది భరించాలి అని బరస్ట్ అయింది. తను చెప్పిందే రైట్ అని అవతలి వాళ్లూ ఒప్పుకోవాలనే మెంటాలిటీ కూడా అతనిలో కనిపిస్తోంది. దీన్నే యశ్మి భరించలేకపోయింది. చాలా కోపంగా అరిచింది. దీంతో మూసుకుని బయటకు వెళ్లిపోయాడతను. మరి ఏమైందో కానీ.. ఇప్పుడు మరో కంటెస్టెంట్ తో పులిహోర కలుపుతున్నాడు.
మిగతా మేల్ కంటెస్టెంట్స్ అభయ్, పృథ్వీ, నబిన్, మణికంఠ లాంటి వారిపైనా తనే ఆధిపత్యం ప్రదర్శించే ప్రయత్నం చేస్తున్నాడు. కాకపోతే గేమ్స్ లో మాత్రం స్ట్రాంగ్ గా కనిపిస్తున్నాడు. ఓవరాల్ గా చూస్తే తనకు తాను ఏదో శివాజీ లాగా పెద్దన్నను అనిపించుకోవాలనే ఆరాటంలో కనిపిస్తున్నాడు. కానీ కంటెస్టెంట్స్ కానీ ఆడియన్స్ అతన్ని గమనిస్తూనే ఉన్నారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com