Nikhil Siddhartha: ఐ మిస్ యూ డాడీ.. మనం మళ్లీ కలుద్దాం: నిఖిల్ ఎమోషనల్ పోస్ట్

Nikhil Siddhartha: ఐ మిస్ యూ డాడీ.. మనం మళ్లీ కలుద్దాం: నిఖిల్ ఎమోషనల్ పోస్ట్
Nikhil Siddhartha: నిఖిల్ భావోద్వేగ పోస్ట్ తన తండ్రితో తన మధురమైన జ్ఞాపకాలను గుర్తుచేసింది. లెటర్ తో పాటు తన తండ్రితో దిగిన కొన్ని ఫోటోలను కూడా పంచుకున్నాడు.

Nikhil Siddhartha: తండ్రి మరణం అతడిని వేదనకు గురి చేసింది.. తండ్రి తనకు ఉన్న అనుబంధాన్ని తీపి గుర్తులను నెమరు వేసుకున్నాడు హీరో నిఖిల్ సిద్ధార్థ. గురువారం మరణించిన తన తండ్రికి లేఖ రాసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. తీవ్ర భావోద్వేగాలతో కూడిన ఆ లేఖ అభిమానుల కళ్లు చెమర్చేలా చేసింది.

నిఖిల్ 'కార్తికేయ 2' సినిమా చేస్తున్నప్పుడు ఇంటి నుండి వచ్చిన ఫోన్ కాల్ అతడిని దు:ఖసాగరంలో ముంచెత్తింది. తన తండ్రి శ్యామ్ సిద్ధార్థ కార్టికోబాసల్ డిజెనరేషన్ అనే అరుదైన వ్యాధితో మరణించాడని తెలుసుకున్న నిఖిల్ గుండె పగిలింది.

"నిన్న మా నాన్న శ్యామ్ సిద్ధార్థ కన్నుమూసినందుకు చాలా బాధపడ్డాను. మీరు ఎక్కడున్నా మీ ఆత్మకు శాంతి లభిస్తుందని ఆశిస్తున్నాను డాడీ..ఐ లవ్ యూ.." ''ఆర్టీసీ ఎక్స్‌రోడ్ లో మనం చూసిన సినిమాలు, తిన్న బిర్యానీలు, కలిసి చేసిన ప్రయాణాలు, మాట్లాడుకున్న మాటలు, వేసుకున్న జోకులు అన్నీ గుర్తొస్తున్నాయి. వేసవి సెలవులు ముంబైలో గడిపిన రోజులు గుర్తొస్తున్నాయి..

"నేను మీ కొడుకుగా ఉన్నందుకు ఎప్పుడూ గర్వపడుతున్నాను. మనం మళ్ళీ కలుస్తామని ఆశిస్తున్నాను నాన్న", అని నిఖిల్ తన దివంగత తండ్రి గురించి సందేశాన్ని పంచుకున్నాడు. నిఖిల్ భావోద్వేగ పోస్ట్ తన తండ్రితో తన మధురమైన జ్ఞాపకాలను గుర్తుచేసింది. లెటర్ తో పాటు తన తండ్రితో దిగిన కొన్ని ఫోటోలను కూడా పంచుకున్నాడు.

"గత 8 సంవత్సరాలుగా తండ్రి అనారోగ్యంతో బాధపడుతున్నాడు. వ్యాధిని ఎదుర్కునేందుకు తన శాయశక్తులా కృషి చేసాడు, మా అమ్మ, కుటుంబ సభ్యుల మద్దతు ఇన్ని రోజులు జీవించాడు. ఇన్ని సంవత్సరాల పోరాటంలో అలసిపోయిన నాన్న నిన్న తుది శ్వాస విడిచాడు."

"మహానటులు ఎన్టీఆర్ & ఏఎన్ఆర్‌లు అంటే ఆయనకు విపరీతమైన అభిమానం. ఆయనకు సినిమాలంటే చాలా ఇష్టం. ఏదో ఒక రోజు నన్ను వెండితెరపై చూడాలని కలలు కనేవారు. ఆయన ఆశయం, ఆయన ఇచ్చిన సపోర్ట్ నన్ను ఈ రోజు నటుడిగా మార్చాయి" అని నిఖిల్ గుర్తుచేసుకున్నాడు.

"మీరు ఎక్కడ ఉన్నా డాడీ మీకు శాంతి లభిస్తుందని ఆశిస్తున్నాము. మేము నిన్ను ప్రేమిస్తున్నాము, మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నాము. మేము మీ గురించి ఆలోచించకుండా ఒక్క రోజు కూడా గడిచిపోదు" అని నిఖిల్ రాశాడు. ఇది అతని అభిమానులపై కూడా లోతైన ప్రభావాన్ని చూపుతుంది.



Tags

Read MoreRead Less
Next Story