Nikhil Siddharth : స్వయంభు పోస్ట్ పోన్.. సెంటిమెంటా.. లేక

Nikhil Siddharth :  స్వయంభు పోస్ట్ పోన్.. సెంటిమెంటా.. లేక
X

నిఖిల్ సిద్ధార్థ్ హీరోగా నటించిన మూవీ స్వయంభు. ఈ మూవీ కోసం చాలాకాలంగా చిత్రీకరణ చేస్తున్నాడు నిఖిల్. ఓ దశలో ఈ ప్రాజెక్ట్ గురించి అస్సలు వినిపించలేదు. దీంతో ఆగిపోయింది అనుకున్నారు. అలాంటి టైమ్ లో సడెన్ గా ఎంట్రీ ఇచ్చింది టీమ్. ఈ మూవీ మేకింగ్ అంటూ ఒక వీడియో విడుదల చేసింది. దీంతో జనం కూడా బాగా ఆకట్టుకుందీ వీడియో అని చెప్పారు. ఇక ఈ మూవీ ఫిబ్రవరి 13న రిలీజ్ అంటూ అనౌన్స్ మెంట్ కూడా ఇచ్చారు. బట్ ఏమైందో కానీ ఈ మూవీ పోస్ట్ పోన్ చేయబోతున్నారు. మార్చి లేదా ఏప్రిల్ లో ఈ మూవీని విడుదల చేయాలనుకుంటున్నారు. మరి ఈ మార్పు వెనక కొత్తగా ఏదైనా సెంటిమెంట్ ఉంటుందా అంటే అవుననే అంటున్నారు.

కొన్నాళ్ల క్రితం విడుదలైన కార్తికేయ 2 మూవీ వాయిదా పడింది. అలాగే వాయిదా వేశారు కూడా. ఈ రెండోది కావాలనే కొందరి కారణంగా వాయిదా పడింది. లేట్ అయినా కార్తికేయ 2 బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఏకంగా 100 కోట్లు కూడా సాధించింది. అయితే ఆ తర్వాత నిఖిల్ చేసిన స్పై, 18 పేజెస్, అప్పుడో ఇప్పుడో ఎప్పుడో అనే మూవీస్ డిజాస్టర్స్ గా నిలిచిపోయాయి. అదే టైమ్ లో స్వయంభు అప్డేట్స్ రావడంతోనే చాలామంది ఈ మూవీ ఆగిపోయింది అనే డౌట్స్ క్రియేట్ చేశారు.

ఈ మూవీ పోస్ట్ పోన్ చేయడానికి కారణం కార్తికేయ 2 సెంటిమెంట్ ఏమైనా కారణం ఉండొచ్చేమో అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. లేదంటే ఇంకేవైనా కారణాలున్నాయోమో తెలియాల్సి ఉంది. ఇక నిఖిల్ తో పాటు సంయుక్త, నభా నటేష్ హీరోయిన్లుగా నటించారీ మూవీలో. హిస్తారికల్ కంటెంట్ తో రూపొందుతోన్న ఈ మూవీకి సెంథిల్ కుమార్ సినిమాటోగ్రాఫర్ కావడం విశేషం. కొత్త దర్శకుడు భరత్ కృష్ణమాచారి రూపొందిస్తోన్న చిత్రం ఇది. మరి ఈ సెంటిమెంట్స్ వర్కవుట్ అవుతాయా లేదా అనేది చూడాలి.

Tags

Next Story