Nikhil Sidharth : ఫ్రెండ్ కి హ్యాండ్ ఇస్తున్నావా నిఖిల్ ..?
ఇప్పుడంటే నిఖిల్ సిద్ధార్థ్ ని అంటున్నాడు కానీ కెరీర్ ఆరంభంలో అతను నిఖిల్ మాత్రమే. హ్యాపీడేస్ తో వచ్చిన బ్రేక్ తో వరుసగా సినిమాలు చేశాడు. చాలా వరకూ పోయాయి. అది కాక అతను రవితేజను ఇమిటేట్ చేస్తున్నాడు అనే విమర్శలూ వచ్చాయి. ఆ టైమ్ లో వచ్చింది స్వామిరారా మూవీ. అతని బాడీ లాంగ్వేజ్ ను మార్చడమే కాదు. టేకింగ్ పరంగానూ భలే ఉందే అనిపించిందా సినిమా. దర్శకుడు సుధీర్ వర్మ. నిఖిల్ కు అంతకు ముందు నుంచే ఫ్రెండ్. అతనితో పాటు చందు మొండేటి. ఈ ముగ్గురినీ మొన్నటి వరకూ ఫ్రెండ్షిప్ డే అంటే చాలా మీడియా సంస్థలు ఇంటర్వ్యూస్ కు పిలిచేవి. ఒకరికొరు తోడుగా నిలబడి తమకంటూ ఓ స్థానం తెచ్చుకున్నారు. బట్ సుధీర్ వర్మ మాత్రం కాస్త వెనక బడ్డాడు. మనోడి టేకింగ్ బావుంటుంది కానీ.. కథనాలు దెబ్బ కొడుతున్నాయి. ఈ టైమ్ లో అతనికి సపోర్ట్ చేస్తూ ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’ అనే సినిమాకు కమిట్ అయ్యాడు నిఖిల్. ఇదంతా కార్తికేయ 2కు ముందు. కార్తికేయ 2 వచ్చింది. ప్యాన్ ఇండియా రేంజ్ లో హిట్ అయింది. నిఖిల్ సిద్ధార్థ్ తనను తాను ప్యాన్ ఇండియా హీరోనే అనుకుని స్పై అనే మూవీని ప్యాన్ ఇండియా రేంజ్ లో విడుదల చేశాడు. డిజాస్టర్ అయింది. ఇటు సుధీర్ వర్మ ప్రాజెక్ట్ కు అన్నీ అవాంతరాలే. దీంతో బాగా లేట్ అయింది. పైగా రుక్మిణి వసంత్ హీరోయిన్. ఈవిడ ఈ ప్రాజెక్ట్ ఓకే చేసే టైమ్ కు సప్త సాగరాలు దాటి అనే బ్లాక్ బస్టర్ లేదు. సో.. ఇది అదనంగా కలిసొస్తుంది అనుకుంటే ఇక్కడే నిఖిల్ ప్రవర్తన తేడాగా మారిందట.
అప్పుడో ఇప్పుడో ఎప్పుడో మూవీ నవంబర్ 8న విడుదల అనుకున్నారు. బట్ సుధీర్ వర్మ కలిసొచ్చే అవకాశం ఉన్నా.. ఈ మూవీ ప్రమోషన్స్ కు నో చెబుతున్నాడట నిఖిల్. ఈ మూవీ వస్తే ఇప్పుడు పెరిగిన తన క్రేజ్ తగ్గుతుందని భావిస్తున్నాడా లేక అగ్రిమెంట్స్ అయిపోయాయి కాబట్టి వద్దనుకుంటున్నాడా అనేది తెలియదు కానీ.. సుధీర్ వర్మ టైమ్ అస్సలు బాలేదిప్పుడు. ఈ టైమ్ లో స్నేహితుడుగా అండగా నిలవాల్సింది పోయి.. ఇలా సైలెంట్ అయిపోవడంతో చాలామంది నిఖిల్ ను స్వార్థపరుడు అంటున్నారు. కష్ట కాలంలో ఫ్రెండ్ కు హ్యాండ్ ఇస్తావా అని అంటున్నారు. మరి ఈ మూవీ విషయంలో నిఖిల్ ప్రమోషన్స్ పై విముఖంగా ఉండటానికి అసలు కారణాలేంటో కానీ.. అతను వస్తే సుధీర్ కు హెల్ప్ అవుతుందనేది మాత్రం నిజం. అలాగే తను వస్తే రుక్మిణి వసంత్ కూడా తన ఫస్ట్ తెలుగు మూవీ అని ప్రమోషన్స్ కు రావొచ్చు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com