Nikhil New Movie : దీపావళికి 'అప్పుడో.. ఇప్పుడో.. ఎప్పుడో'

Nikhil New Movie : దీపావళికి అప్పుడో.. ఇప్పుడో.. ఎప్పుడో
X

తన ఫ్యాన్స్ కి ఊహించని ట్విస్ట్ ఇచ్చాడు హీరో నిఖిల్. ఎవరూ ఊహించని విదంగా కొత్త సినిమాను ప్రకటించాడు. అది కూడా దీపావళికి విడుదల అంటూ ప్రకటన చేశాడు. దాంతో ఆయన ఫ్యాన్స్ ఒక్కసారిగా అవాక్కాయ్యారు. అసలు ఈ సినిమా ఎప్పుడు మొదలుపెట్టవన్నా అంటూ కామెంట్స్ చస్తున్నారు. ఇంతకీ ఆ సినిమా ఏంటంటే "అప్పుడో.. ఇప్పుడో.. ఎప్పుడో". స్వామి రారా ఫేమ్ దర్శకుడు సుధీర్ వర్మ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో సప్తసాగరాలు దాటి ఫేమ్ రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమా థీమ్ పోస్టర్ విడుదల చేశారు మేకర్స్. ఫీల్ గుడ్ లవ్లీ లుక్స్ తో ఉన్న ఈ పోస్టర్ ఆడియన్స్ ను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఇప్పటికే నిఖిల్, సుధీర్ వర్మ కాంబోలో స్వామి రారా, కేశవ వంటి హిట్ సినిమాలు రాగా "అప్పుడో.. ఇప్పుడో.. ఎప్పుడో" ఎలాంటి విజయాన్ని సాధిస్తుందో చూడాలి.

Tags

Next Story