Nikhil Siddhartha : నిఖిల్ కు దెబ్బ మీద దెబ్బ

ఏ హీరోకైనా ఓ పెద్ద బ్లాక్ బస్టర్ పడగానే దాన్ని కంటిన్యూ చేస్తూ మళ్లీ హిట్ కొట్టాలనే ఉంటుంది. కానీ హిట్టూ ఫ్లాపులు అనేవి వారి చేతుల్లో ఉండవు. కార్తికేయ 2తో అనూహ్యంగా ప్యాన్ ఇండియా మార్కెట్ లోకి అడుగుపెట్టాడు నిఖిల్ సిద్ధార్థ్. ఈ మూవీకి నేషనల్ అవార్డ్ కూడా వచ్చింది. కార్తికేయ 2 అతని కెరీర్ కు చాలా పెద్ద బూస్టప్ ఇచ్చింది. కానీ ఆ బూస్టింగ్ చాలా వేగంగా ఊస్టింగ్ అయిపోయింది అనేది నిజం. ఎందుకంటే ఇంత పెద్ద హిట్ తర్వాత ఏకంగా హ్యాట్రిక్ డిజాస్టర్స్ పడ్డాయి నిఖిల్ కు.
కార్తికేయ 2 తర్వాత వచ్చిన 18 పేజెస్ అనే సినిమా అసలు సోదిలోనే లేకుండా పోయింది.ఆ తర్వాత మరోసారి ప్యాన్ ఇండియా సినిమా అంటూ నానా హడావిడీ చేసి విడుదల చేసిన స్పై చూసి జనాల మతి పోయింది. ఇంత వీక్ స్టోరీ, స్క్రీన్ ప్లే ఈ మధ్య కాలంలో చూడలేదు అనుకున్నారు. పైగా స్పై సినిమాల్లో ఉండే దేశభక్తి కానీ, ఎగ్జైట్మెంట్ కానీ ఈ మూవీలో కనిపించదు. అందుకే డిజాస్టర్ అయిపోయింది. కార్తికేయ 2 తర్వాత మరోసారి ప్యాన్ ఇండియా రేంజ్ లో హిట్ కొట్టాలనుకున్న నిఖిల్ కలను స్పై నెరవేర్చలేదు.
ఇక ముందే ప్రిపేర్ అయిన డిజాస్టర్ లా అనిపించుకుంది ఈ శుక్రవారం వచ్చిన ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’. ఏ మాత్రం ఎంగేజింగ్ గా లేని ఈ మూవీని వాళ్లే ముందుగా వదిలేశారు. ప్రమోషన్స్ చేయలేదు. జనాల్లోకి తీసుకువెళ్లే ప్రయత్నమూ చేయలేదు. అలాగని ఇది నిఖిల్ సినిమా కాకుండా పోతుందా..? మొదటి ఆట పూర్తి కాకుండానే డిజాస్టర్ గా తేల్చారు జనం. మొత్తంగా ప్యాన్ ఇండియా స్టార్ గా అవతరించాలని తహతహలాడుతోన్న నిఖిల్ కు కార్తికేయ 2 హ్యాట్రిక్ డిజాస్టర్స్ పడటం ఖచ్చితంగా అతని మార్కెట్ పై ప్రభావం చూపిస్తుంది. పైగా రాబోయేవి భారీ బడ్జెట్ మూవీస్. ఆ సినిమాలపై ఈ హ్యాట్రిక్ డిజాస్టర్స్ ప్రభావం పడకుండా ఉంటుందా..?
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com