Nikki Sharma: ఇన్‌స్టాగ్రామ్ పోస్టులు డిలీట్ చేసిన నటి.. చివరిగా ఓ స్టోరీ పెట్టి మాయం..

Nikki Sharma (tv5news.in)
Nikki Sharma: ఈమధ్య ఒకరు బాధగా ఉన్నా.. కోపంగా ఉన్నా.. అదంతా సోషల్ మీడియాలోనే చూపిస్తున్నారు. వాట్సాప్ డీపీలు తీసేయడం, ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ డిలీట్ చేయడం లాంటివి ఫ్యాషన్ అయిపోయింది. తాజాగా ఓ బుల్లితెర నటి కూడా తన ఇన్‌స్టాలో పోస్టులన్నీ డిలీట్ చేసింది. కానీ తను చివరిగా పెట్టిన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ.. తన స్నేహితులను ఆందోళనకు గురయ్యేలా చేస్తోంది.
పలు బాలీవుడ్ సీరియల్స్‌లో హీరోయిన్‌గా నటించి.. క్యూట్ యాక్టింగ్‌తో ప్రేక్షకులను ఆకట్టుకున్న నటి నిక్కీ శర్మ. ఇటీవల తాను తన ఇన్‌స్టా్గ్రామ్ పోస్టులన్నీ డిలీట్ చేసింది. అంతే కాకుండా 'నేను ప్రయత్నించాను.. కానీ నేను అలసిపోయాను. నేను నా ఆలోచనల నుండి ఫ్రీ అవ్వాలనుకుంటున్నాను' అని చివరిగా తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో పెట్టింది. దీంతో తన సహ నటుడు అభిషేక్ భలేరావు తనను కాంటాక్ట్ చేయడానికి ప్రయత్నించి విఫలమయ్యాడు.
ఏ రకంగా నిక్కీని కాంటాక్ట్ చేయడానికి ప్రయత్నించిన కుదరకపోవడంతో అభిషేక్ భలేరావు.. తన సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టాడు. 'నాతో పాటు సీరియల్‌లో నటించి నిక్కీ శర్మ తన ఇన్‌స్టాగ్రామ్ పోస్టులన్నీ డిలీట్ చేసింది. అంతే కాకుండా చివరిగా ఈ స్టోరీ కనిపించింది. నేను ఎన్ని విధాలుగా తనను కాంటాక్ట్ చేయడానికి ప్రయత్నించిన కుదరట్లేదు' అంటూ తన ఫ్రెండ్స్‌ను ట్యాగ్ చేశాడు అభిషేక్.
నిక్కీ శర్మ మానసిక స్థితి బాలేదని తన స్నేహితులు చెప్పారంటూ ఓ వెబ్‌సైట్ ప్రచారం చేసింది. నిక్కీతో మాట్లాడిన ఓ స్నేహితురాలు కూడా తనను తాను చూసుకోగలనని చెప్పిందని పేర్కొన్నారు. కానీ ఇప్పటివరకు నిక్కీ మాత్రం తనంతట తానుగా దీనిపై ఏ విధంగా స్పందించలేదు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com