సినిమా

Nithiin: నితిన్‌తో స్టెప్పులేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన బాలీవుడ్ భామ..

Nithiin: రాజశేఖర్ రెడ్డి దర్శకత్వంలో నితిన్ నటిస్తున్న చిత్రమే ‘మాచర్ల నియోజకవర్గం’.

Nithiin (tv5news.in)
X

Nithiin (tv5news.in)

Nithiin: సినిమాల్లో తళుక్కున మెరిసే ఐటెమ్ సాంగ్స్ అంటే ప్రేక్షకులకు ఎప్పటినుండో క్రేజ్. అందుకే ఆ పాటకు సంగీతం దగ్గర నుండి ఆ పాటలో మెరిసే నటి వరకు అన్నింటి గురించి ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుంటారు దర్శకులు. ఇంతకు ముందు ఈ పాటల కోసం బాలీవుడ్ భామలను ప్రత్యేకంగా దింపేవారు మేకర్స్. ఇప్పుడు మరోసారి అదే ట్రెండ్ తెరపైకి వచ్చేటట్టు కనిపిస్తోంది.

గత కొంతకాలంగా హీరోయిన్లే ఐటెమ్ సాంగ్ చేయడం ఆనవాయితీగా మారింది. ఒకప్పుడు కెరీర్ ఫేడవుట్ అయిన హీరోయిన్లు మాత్రమే స్పెషల్ సాంగ్స్ చేయడానికి ఒప్పుకునేవారు. ఇప్పుడు అలా కాదు.. అటు చేతినిండా సినిమాలు ఉన్నా.. ఇటు స్పెషల్ సాంగ్స్‌కు కూడా గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. అయితే అలా కాకుండా మళ్లీ బాలీవుడ్ భామలతో ఐటెమ్ సాంగ్ చేయించే ట్రెండ్‌ను ఫాలో అవ్వాలనుకుంటున్నాడు హీరో నితిన్.

రాజశేఖర్ రెడ్డి దర్శకత్వంలో నితిన్ నటిస్తున్న చిత్రమే 'మాచర్ల నియోజకవర్గం'. అయితే ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఏప్రిల్‌లో ఈ మూవీ విడుదలను కూడా ఖరారు చేశారు. అయితే ఈ సినిమాలో ఐటెమ్ సాంగ్ కోసం ఏకంగా బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌతేలాను రంగంలోకి దింపనుందట మూవీ టీమ్. ఇక నితిన్ కూడా ఓ ఐటెమ్ భామతో స్పెప్పులేసి చాలాకాలం కావడంతో.. ఈ వార్త విన్న తన అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.Divya Reddy

Divya Reddy

Divya reddy is an excellent author and writer


Next Story

RELATED STORIES