సినిమా

Macherla Niyojakavargam : గుంటూరు జిల్లా కలెక్టర్‌గా నితిన్ .. ఉత్తర్వులు జారీ..!

Macherla Niyojakavargam : గుంటూరు జిల్లా కలెక్టర్‌గా నియమించినట్లు ప్రకటన ఉత్తర్వులు వెలువడ్డాయి. మార్చి 26న ఆయన మొదటి బాధ్యతలు స్వీకరించారు

Macherla Niyojakavargam : గుంటూరు జిల్లా కలెక్టర్‌గా నితిన్ .. ఉత్తర్వులు జారీ..!
X

Macherla Niyojakavargam : యంగ్ హీరో నితిన్ నటిస్తోన్న లేటెస్ట్ మూవీ మాచర్ల నియోజకవర్గం.. ఎం.ఎస్.రాజ శేఖర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ మూవీలో కృతి శెట్టి, కేథరిన్ థ్రెసా హీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ నుంచి ఫస్ట్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్.

ఈ సినిమాలో నితిన్ ఎన్ సిద్ధార్థ్ రెడ్డి అనే ఓ ఐఏఎస్ అధికారి పాత్రలో నటించనున్నాడు. "గుంటూరు జిల్లా కలెక్టర్‌గా నియమించినట్లు ప్రకటన ఉత్తర్వులు వెలువడ్డాయి. మార్చి 26న ఆయన మొదటి బాధ్యతలు స్వీకరించారు" అంటూ మూవీ నుంచి ఫస్ట్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్.

శ్రేష్ట్ మూవీస్, ఆదిత్య మూవీస్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీ పక్క పొలిటికల్ ఎలిమెంట్స్‌తో రూపొందుతోంది. మహతి స్వర సాగర్ స్వరాలు సమకూరుస్తున్నారు. త్వరలోనే సినిమా టీజర్ కూడా రిలీజ్ కానుంది.


Next Story

RELATED STORIES